ఒకే ఒక జీవితం.. శర్వానంద్ బ్యాక్ ఇన్ షేప్!

by Manoj |
ఒకే ఒక జీవితం.. శర్వానంద్ బ్యాక్ ఇన్ షేప్!
X

దిశ, సినిమా: ఈ మధ్య కాలంలో టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్‌కు ఊహించని పరాజయాలు ఎదురయ్యాయి. దీనికి తోడు తన చివరి చిత్రం 'ఆడవాళ్లు మీకు జోహార్లు'లో కొంచెం లావుగా కనిపించాడు. నిజానికి ఏ నటుడైనా కెరీర్‌లో విభిన్న పాత్రలను పోషించాలంటే ఫిజికల్ మేకోవర్‌ ఇంపార్టెంట్. కొన్ని సినిమాల్లో పాత్రను బట్టి బరువు పెరగాల్సి ఉంటే.. కొన్ని చిత్రాల్లో సిక్స్ ప్యాక్‌తో, మరికొన్నింట సన్నగా కనిపించాల్సిన అవసరం ఉంటుంది.

ఇప్పటి వరకు శర్వానంద్ నటించిన చిత్రాలు చూసుకుంటే.. ఎక్కువగా పక్కింటి కుర్రాడి తరహా పాత్రల్లో ఫిట్‌గా కనిపించాడు. కానీ తన చివరి చిత్రంలో బాడీ షేప్ అవుట్ అయినట్లు కనిపించింది. ఈ నేపథ్యంలోనే కొంతకాలం సినిమాల నుంచి బ్రేక్ తీసుకున్న శర్వా.. తన ఇన్‌స్టా ఫాలోవర్స్ సంఖ్య 1 మిలియన్ చేరుకున్న సందర్భంగా కొత్త లుక్ రివీల్ చేశాడు. ఈ పిక్‌లో బరువు తగ్గిపోయి స్లిమ్ అండ్ స్మార్ట్‌గా దర్శనమిచ్చాడు. ప్రస్తుతం 'ఒకే ఒక జీవితం' సినిమాలో నటిస్తున్న శర్వానంద్ త్వరలోనే తన కొత్త ప్రాజెక్ట్‌ ప్రకటించనున్నాడు.

Advertisement

Next Story