- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ప్రధాని మోడీ ఫొటో ఎందుకు పెట్టలేదు.. అధికారులపై ఆగ్రహం
దిశ, కంది : పల్లెలు, పట్టణాలు ఆరోగ్యంగా వర్ధిల్లాలనే నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆయుష్ గ్రామ్ కార్యక్రమంను సంగారెడ్డి జిల్లా కంది ఉన్నత పాఠశాలలో ఈనెల 3న తెలంగాణ కమిషనర్ అలుగు వర్షిని జిల్లా అదనపు కలెక్టర్ రాజర్షి షాతో కలిసి ప్రారంభించిన విషయం విధితమే. ఈ నేపథ్యంలో శుక్రవారం సంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షుడు నరేందర్ రెడ్డి ఇతర ముఖ్య నాయకులు ఆ కార్యక్రమాన్ని పరిశీలించడానికి వెళ్లారు.
సొమ్ము ఒకరిది సోకు మరొకరిదా..!
ఆయుష్ ప్రోగ్రాం నిర్మాణంలో భాగంగా కంది ఉన్నత పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ప్రధాని మోడీ బొమ్మ లేకపోవడంతో బీజేపీ నాయకులు అధికారుల తీరుపై మండిపడ్డారు. ఈ కార్యక్రమానికి నిధులు కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తున్నా మీరు మాత్రం ఇక్కడ ముఖ్యమంత్రి ఫోటో పెట్టి ప్రచారం చేయడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. ఒకవేళ ఫోటోలు పెడితే ప్రధాని మోడీతో పాటు ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోటో కూడా పెట్టాలి కానీ మీకు తోచిన విధంగా చేస్తే సరైన పద్ధతి కాదంటూ ఆగ్రహం వ్యక్తం. వెంటనే అక్కడ ఉన్న ఫ్లెక్సీపై ప్రధాని మోడీ ఫోటో అతికించి, ఇకనైనా ఇలాంటి తప్పులు పునరావృతం కాకుండా చూడాలని అధికారులను, ఇతర సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కొండాపూర్ జగన్, నర్సారెడ్డి, హనుమంత్ రెడ్డి, రవీందర్ రెడ్డి, నాయి కోటి రాములు, అరవింద్ ఇతరులు పాల్గొన్నారు.