- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆరోగ్యశాఖలో ఖాళీలను భర్తీ చేస్తారా.. లేదా?
దిశ, తెలంగాణ బ్యూరో: ఆరోగ్యశాఖలో ఖాళీలపై స్పష్టత కరువైంది. సీఎం, మంత్రి ప్రకటన మధ్య వ్యత్యాసం స్పష్టంగా కనిపిస్తన్నది. మరోవైపు బిస్వాల్ కమిటీ నివేదిక ఇంకోలా ఉంది. అసలు ఖాళీలెన్ని? ఎన్ని పోస్టులు భర్తీ చేస్తారు? చట్టసభల్లో ఎవరు చెప్పిన లెక్క పక్కానో తెలియక అయోమయం నెలకొంది. ఖాళీలపై క్లారిటీ లేక అధికారుల్లో సైతం గందరగోళం నెలకొంది.
బడ్జెట్ సమావేశాల సందర్భంగా సీఎం కేసీఆర్ వైద్యారోగ్యశాఖలో అన్ని విభాగాలు కలిపి 12,755 పోస్టులు ఖాళీగా ఉన్నాయని ప్రకటించారు. 20 వేల ఉద్యోగాలు నింపుతామని మూడు రోజుల క్రితం ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు అసెంబ్లీలో చెప్పుకొచ్చారు. అయితే ముఖ్యమంత్రి చెప్పిన లెక్కకు, మంత్రి హరీశ్ రావు ప్రకటించిన సంఖ్యకు ఎక్కడా పొంతన కుదరడం లేదు. పైగా ఇద్దరూ చట్టసభల్లోనే ప్రకటించడం గమనార్హం. మరోవైపు బిస్వాల్ కమిటీ తయారు చేసిన పీఆర్సీ నివేదికలో హెల్త్ డిపార్ట్ మెంట్ లో 30,570 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు చూపారు. దీంతో ఎవరి లెక్కలు కరెక్ట్ అనేది తేలడం లేదు. అసలు లెక్కలే తప్పా లేదా ఖాళీ పోస్టులపై ఇప్పటి వరకు క్లారిటీ లేదా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ లెక్కలను చూసి స్వయంగా డిపార్ట్ మెంట్ లోని అధికారుల్లోనూ గందరగోళం నెలకొన్నది. ఆరోగ్యశాఖలోని ఖాళీలెన్ని? అని అడిగితే స్పష్టమైన సమాధానం చెప్పలేని పరిస్థితి ఉన్నది. సీఎం ప్రకటించింది చెప్పాలా? మంత్రి చెప్పిన సంఖ్య వెల్లడించాలా? పీఆర్సీ నివేదికను ఇవ్వాలా? అని టెన్షన్ పడుతున్నారు.
భర్తీ చేస్తారా? లేదా?
వైద్యారోగ్యశాఖలోని ఖాళీలన్నీ వేగంగా నింపుతామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ నిరుద్యోగులకు నమ్మకం కలగడం లేదు. అసలు ఖాళీల వివరాలే తప్పుగా చూపిస్తుంటే పోస్టుల భర్తీ ఎలా చేస్తారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీంతో నోటిఫికేషన్ వచ్చే వరకు ఈ ప్రభుత్వాన్ని నమ్మలేమని కొందరు డాక్టర్లు కూడా వాపోతున్నారు. ఒక వేళ నోటిఫికేషన్ వచ్చినా తొలి విడత కేవలం ఐదువేల పోస్టులకు మాత్రమే వస్తుందని, కోఠిలోని మెడికల్ బోర్డు ద్వారా డాక్టర్లు, స్టాఫ్ నర్సులను నింపే అవకాశం ఉన్నదని ఓ ఉన్నతాధికారి తెలిపారు. పారా మెడికల్ స్టాఫ్ రిక్రూట్ మెంట్లను టీఎస్పీఎస్సీ ద్వారా నింపాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు వివరించారు. అయితే ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుంది? అసలు పోస్టులు రిక్రూట్ చేస్తారా? లేదా అనే విషయంపై ప్రభుత్వం నుంచి ఎలాంటి క్లారిటీ లేదని ఆయన చెప్పడం గమనార్హం. దీంతో నిరుద్యోగులు కూడా ఆందోళనకు గురవుతున్నారు.