- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పీజీ వైద్య సీట్ల భర్తీకి నోటిఫికేషన్ జారీ..
దిశ ప్రతినిధి, వరంగల్: రాష్ట్రంలోని ప్రైవేట్ వైద్య కళాశాలల్లో పీజీ వైద్య యాజమాన్య కోటా సీట్ల భర్తీకి కాళోజి ఆరోగ్య విశ్వవిద్యాలయం గురువారం నోటిఫికేషన్ జారీ చేసింది. మిగిలిన పీజీ యాజమాన్య కోటా సీట్లను ఈ మాప్ అప్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. యాజమాన్య కోటకు ఇప్పటికే రెండు విడతల కౌన్సిలింగ్ పూర్తి అయింది. తుది మెరిట్ జాబితాలోని అర్హులైన అభ్యర్థులు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. ఏప్రిల్ 1వ తేదీన ఉదయం 6గంటల నుంచి సాయింత్రం 6 గంటల వరకు ప్రాధాన్యతా క్రమంలో కళాశాలల వారీగా వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. గత విడత కౌన్సిలింగ్లో సీట్ అలాట్ అయి జాయిన్ కాకపోయినా, చేరి డిస్ కంటిన్యూ చేసినా.. అదే విధంగా ఆల్ ఇండియా కోటాలో ఇప్పటికే చేరిన అభ్యర్థులు ఈ కౌన్సిలింగ్కు అనర్హులు. పూర్తి వివరాలకు విశ్వవిద్యాలయ వెబ్సైట్ www.knruhs.telangana.gov.in లో చూడాలని యూనివర్సిటీ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపాయి.