Superstar krishna: ఈ రికార్డు ఎవరూ బ్రేక్ చేయలేరు.. సూపర్ స్టార్ కృష్ణకు మాత్రమే సొంతమైన అరుదైన ఘనత

by Prasanna |
Superstar krishna: ఈ రికార్డు ఎవరూ బ్రేక్ చేయలేరు.. సూపర్ స్టార్ కృష్ణకు మాత్రమే సొంతమైన అరుదైన ఘనత
X

దిశ, వెబ్ డెస్క్ : తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలు డ్యూయల్ రోల్ లో నటించిన సినిమాలు చాలానే ఉన్నాయి. అయితే టాలీవుడ్ స్టార్ హీరోలు ట్రిపుల్ రోల్స్ లో నటించిన సినిమాలు తక్కువగా ఉన్నాయి. చిరంజీవి ముగ్గురు మొనగాళ్లు , బాలయ్య అధినాయకుడు , జూనియర్ ఎన్టీఆర్ జై లవకుశ మూవీలో ట్రిపుల్ రోల్ లో నటించారు.

అయితే, టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ కృష్ణ ఏకంగా ఏడు సినిమాలలో ట్రిపుల్ రోల్స్ లో నటించి రికార్డు క్రియోట్ చేసాడు. ఇప్పటి హీరోలు డ్యూయల్ రోల్ తప్ప ట్రిపుల్ రోల్స్ చేసే సాహసం ఎవరూ చేయడం లేదు. మరోవైపు స్టార్ హీరోల సినిమాలు రావాలంటే రెండు నుంచి మూడేళ్లు సమయం పడుతుంది. ఈ రికార్డు ఇప్పట్లో బ్రేక్ చేయడం చాలా కష్టం.

టాలీవుడ్ స్టార్ హీరోల రెమ్యునరేషన్ రూ. 100 నుంచి రూ. 150 కోట్ల రూపాయల రేంజ్ లో ఉన్నాయి. ట్రిపుల్ రోల్స్ అంటే కొంచం రిస్క్ తో కూడిన పని. ఇప్పుడున్న హీరోలు ఇలాంటి ప్రాజెక్ట్ లపై పెద్దగా ఆసక్తి చూపించడం లేదని తెలుస్తుంది.

Advertisement

Next Story