- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
18 Pages: విధి నియంత్రించే '18 పేజెస్' లవ్‌స్టోరీ.. వీడియో వైరల్
దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సరికొత్త కథలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. సస్పెన్స్ థ్రిల్లర్ 'కార్తికేయ 2'తో పాటు మరో లవ్‌స్టోరీ '18 పేజెస్'లోనూ నిఖిల్ నటిస్తున్నాడు. ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ నిఖిల్‌తో రొమాన్స్ చేయనుంది. ఈ మూవీని పల్నాటి సూర్య ప్రతాప్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ చిత్రం విధిచేత నియంత్రించబడే ప్రేమకథగా తెరకెక్కుతోంది. ఈ మూవీని డైరెక్టర్ రొమాంటిక్ కామెడీగా జానర్‌లో ప్రేక్షకులను ఆకట్టుకునేలా చిత్రీకరిస్తున్నాడు. అయితే హైదరాబాద్‌లో సిద్ధు, నందినిల ప్రేమకథ నేపథ్యంలో ఈ సినిమా రూపొందింది. ఇదిలా ఉండగా ఈ సినిమాకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇందులో నిఖిల్ తన ఫోన్‌కి ఎల్లవేళలా అతుక్కుపోయే కుర్రాడిలా, తన ఆలోచనలను డైరీలో రాయడానికి ఇష్టపడే అమ్మాయిగా అనుపమ కనిపించారు. వీరి మధ్య ప్రేమ ఎలా పుట్టింది, అది ఎలాంటి పరిణామాలకు దారితీసింది అనేది సినిమా కథ. నిజానికి ఈ సినిమా ఫిబ్రవరి 18, 2022న విడుదల కావాల్సి ఉంది. కానీ కరోనా మహమ్మారి కారణంగా సినిమా ఆలస్యమైంది. ప్రస్తుతం 18 పేజెస్ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. ఈ మూవీ కొత్త రిలీజ్ డేట్‌పై క్లారిటీ రావాల్సి ఉంది. మరి మేకర్స్ మూవీ రిలీజ్‌ను త్వరలో ప్రకటిస్తారేమో చూడాలి.