Nidhi Agarwal: రాజాసాబ్, హరిహరవీరమల్లు అప్డేట్ ఇచ్చిన నిధి అగర్వాల్.. అంచనాలను పెంచుతున్న ట్వీట్

by Hamsa |   ( Updated:2024-10-18 11:58:56.0  )
Nidhi Agarwal: రాజాసాబ్, హరిహరవీరమల్లు అప్డేట్ ఇచ్చిన నిధి అగర్వాల్.. అంచనాలను పెంచుతున్న ట్వీట్
X

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరోయిన్ నిధి అగర్వాల్(Nidhi Agarwal) ‘సవ్యసాచి’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించి యూత్‌లో ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది. ప్రజెంట్ ఈ అమ్మడు స్టార్ హీరోలు ప్రభాస్(Prabhas), పవన్ కల్యాణ్‌(Pawan Kalyan)ల సరసన రెండు పాన్ ఇండియా సినిమాలు రాజాసాబ్(Rajasab), హరిహర వీరమల్లు(Harihara Veeramallu)లో హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే ఈ చిత్రాలకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతున్నప్పటికీ పోస్టర్స్ తప్ప ఏ అప్డేట్స్ రాలేదు. అయితే ఈ సినిమాల అప్డేట్స్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో.. తాజాగా, నిధి అగర్వాల్(Nidhi Agarwal) ‘X’ వేదికగా ఆసక్తికర ట్వీట్ చేసి ఫ్యాన్స్‌లో జోష్ నింపింది. ‘‘ఆర్టిస్టుల జీవితం ఎప్పుడూ సర్‌ప్రైజ్‌లతోనే నిండి ఉంటుంది. కొన్ని ఆశీర్వాదాలు ఎంతో గొప్పగా ఉంటాయి.

అయితే కొన్ని మర్చిపోలేని అనుభూతిని అందిస్తాయి. ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న రెండు పార్ ఇండియా సినిమాలు హరిహరవీరమల్లు, రాజాసాబ్‌లలో నేను నటిస్తున్నందుకు ఆనందంగా ఉంది. ఒకే రోజు నేను ఈ రెండింటి షూటింగ్‌లో పాల్గొనడం మరింత సంతోషాన్నిచ్చింది. అది కూడా ఒక సినిమా షూటింగ్ ఆంధ్రాలో, మరొకటి తెలంగాణలో జరుగుతోంది. అయితే మా వర్క్‌ని మీ ముందుకు తీసుకురావడం కోసం వేచి చూస్తున్నా. ఈ చిత్రాలు కచ్చితంగా పండగ వాతావరణాన్ని నింపుతాయి’’ అని రాసుకొచ్చింది. ప్రజెంట్ నిధి అగర్వాల్ ట్వీట్ అంచనాలను పెంచుతోంది.

ఇక ఈ పోస్ట్ చూసిన ప్రభాస్, పవన్ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. కాగా, హరిహరవీరమల్లు జ్యోతికృష్ణ(Jyoti Krishna) తెరకెక్కిస్తుండగా.. షూటింగ్ విజయవాడలో జరుగుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అలాగే ప్రభాస్(Prabhas) హీరోగా నటిస్తున్న రాజాసాబ్(Rajasab) మారుతి(Maruti) దర్శకత్వంలో రాబోతుంది. ఈ హారర్ రొమాంటిక్ మూవీ వచ్చే ఏడాది ఏప్రిల్‌లో విడుదల కానుంది. అయితే ప్రేక్షకుల్లో ఈ రెండు చిత్రాలపై భారీ అంచనాలు నెలకొన్నాయి.





👉 Read Disha Special stories


Next Story

Most Viewed