- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అవయవాల రక్షణకు ఆస్ట్రేలియా కొత్త ఆలోచన.. ఆర్గాన్ ప్రొటెక్టర్స్
దిశ, ఫీచర్స్ :అవయవ దానం కనీసం నలుగురి ప్రాణాలను నిలబెడుతుంది. కానీ ఆ అవయవాలను భద్రపరచడమే సవాల్‌గా మారిన నేపథ్యంలో ఆస్ట్రేలియాకు చెందిన పరిశోధకుల బృందం పరిష్కారాన్ని కనుగొంది. ఆర్గాన్స్, కణజాలాలకు హాని కలగకుండా ఎక్కువ కాలం భద్రపరిచేలా కొత్త క్రియోప్రొటెక్టెంట్స్‌ను గుర్తించింది.
సాధారణంగా జీవకణాలను ఫ్రీజర్‌లో భద్రపరుస్తుంటారు. అయితే ట్రెడిషనల్ ఫ్రీజింగ్ వల్ల మంచు స్ఫటికాలు ఏర్పడే అవకాశముండగా, అవి ఆ కణాలను దెబ్బతీస్తాయి. అందువల్ల డోనార్ అవయవాల విషయంలో ఇదో పెద్ద సమస్య కాగా మంచు స్ఫటికం ఏర్పడకుండా నిరోధించేందుకు క్రియోప్రొటెక్టివ్ ఏజెంట్లను ఉపయోగిస్తారనే విషయం తెలిసిందే. అయితే ప్రస్తుత అవి రక్తం, జంతువుల స్పెర్మ్ వంటి ద్రవ నమూనాలను నిల్వ చేసేందుకు మాత్రమే ఉపయోగిస్తున్నారు, ఎందుకంటే మిగతా అవయవాలను ఈ ఏజెంట్స్ విషపూరితం చేసే అవకాశముంది. దీంతో మెల్‌బోర్న్‌లోని RMIT విశ్వవిద్యాలయ పరిశోధకులు కొత్త రకం క్రియోప్రొటెక్టెంట్స్‌ను గుర్తించారు. ఇవి ఇప్పటికే ఉన్న కణాలను సంరక్షించడంలో ఉత్తమంగా పనిచేస్తుండటంతో పాటు కణాలకు ఎలాంటి హాని కలిగించకుండా సంరక్షిస్తున్నాయి.
చర్మం, మెదడు కణాలతో సహా నాలుగు రకాల కణాలపై వీటి ప్రభావాన్ని పరీక్షించింది పరిశోధకుల బృందం. అయితే కణాలు స్తంభింపజేసేందుకు ముందు కొన్ని గంటలపాటు మానవ శరీర ఉష్ణోగ్రత ( 37 °C /98.6 °F) వద్ద క్రియోప్రొటెక్టెంట్స్‌తో ప్లేస్ చేశారు. ఆ తరువాత నమూనాలను కరిగించి సెల్ డ్యామేజ్ జరిగిందా లేదా అనే విషయాన్ని మైక్రోస్కోప్‌లతో పరిశీలించారు. ఈ మేరకు కొత్త క్రియోప్రొటెక్టెంట్ నాలుగు రకాల కణాలకు ప్రభావవంతంగా ఉంది. ఇప్పటికే ఉన్న ఏజెంట్ల కంటే మెరుగైన సంరక్షణను చూపుతుంది.
'క్షీరద కణాల క్రియోప్రెజర్వేషన్ కోసం ఈ తరగతి ద్రావకాలను క్రమపద్ధతిలో పరీక్షించడం ఇదే మొదటిసారి. ఈ అధ్యయనం నిర్దిష్ట సెల్ రకాలకు అనుగుణంగా రూపొందించిన వేలాది కొత్త క్రియోప్రొటెక్టివ్ ఏజెంట్ల అభివృద్ధికి దారితీయవచ్చు. అయితే, ఈ కొత్త టెక్నిక్‌ని మొత్తం అవయవాలకు ఉపయోగించాలంటే మరింత పరిశోధనలు చేయాల్సి ఉంది' అని పరిశోధకుల బృందం చెబుతోంది.