46 ఏళ్ల వయసులో అలాంటి పని చేస్తున్న స్టార్ హీరోయిన్.. అవసరమా అంటూ ఏకీపారేస్తోన్న నెటిజన్లు

by Kavitha |
46 ఏళ్ల వయసులో అలాంటి పని చేస్తున్న స్టార్ హీరోయిన్.. అవసరమా అంటూ ఏకీపారేస్తోన్న నెటిజన్లు
X

దిశ, సినిమా: అలనాటి స్టార్ హీరోయిన్ భూమిక చావ్లా గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. వరుసగా ఇండస్ట్రీలోని స్టార్ హీరోల అందరితో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నది. చూడటానికి పక్కింటి అమ్మాయిలా కనిపించే ఈ ముద్దుగుమ్మ ఒకప్పుడు టాలీవుడ్‌ను ఒక ఊపు ఊపేసింది. అయితే ఈమె క్లీవేజ్ షో చేయకుండా ట్రెడిషనల్ వేర్‌లోనే పద్ధతిగా కనిపించి ప్రేక్షకుల్లో మంచి ఫేమ్ తెచ్చుకుంది. అలా వరుస సినిమాలతో దూసుకుపోతున్న ఈ అమ్మడుకు.. తర్వాత కొత్త అమ్మాయిల రాకతో అవకాశాలు తగ్గాయి. ఇక సీనియర్ హీరోయిన్లంతా ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్‌లో బిజీ అయ్యేందుకు రెడీ అవుతున్నారు. ఇక ఈమె కూడా బ్యాక్ టు బ్యాక్ సినిమాలను చేస్తుంది. ఇక తాజాగా భూమిక బైక్ స్టంట్ చేసిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఇదిలా ఉంటే.. తాజాగా భూమిక హార్లే డేవిడ్సన్ బైక్‌ను నడిపి సంచలనం సృష్టించింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.. ఆ వీడియోను చూసిన ఫ్యాన్స్ అంతా షాక్ అవుతున్నారు. అదే విధంగా నెటిజన్లు.. ఈ వయసులో అవసరమా అంటూ కొంతమంది కామెంట్స్ చేస్తుంటే.. మరికొంత మంది బండి నడిపేటప్పుడు హెల్మెట్ పెట్టుకోవాలని తెలియదా అంటూ ఏకి పారేస్తున్నారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మరి మీరు దీనిపై ఓ లుక్ వేసేయండి.

Advertisement

Next Story