- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఆ సినిమాను వాడేస్తున్న పోలీసులు.. వాటిపై అవగాహన కోసమే..
దిశ, వెబ్‌డెస్క్: ఈ మధ్య పోలీసులు టెక్నాలజీని వేరే లెవెల్లో వాడేస్తున్నారు. తాము చెబితే ప్రజలు వినడం లేదనుకున్నారో ఏమో కానీ సినిమాల్లోని సన్నివేశాలతో ప్రకటనలు చేయడం ప్రారంభించారు. ఇప్పటికే అనేక సినిమాల్లోని సన్నివేశాలతో చాలా రకాల నేరాలపై అవగాహన కలిపిస్తున్నారు. తాజాగా ముంబై పోలీసులు ఇటువంటి ప్రకటనే మరొకటి చేశారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా సైబర్ క్రైమ్‌లో భారీగా పెరుగుతున్నాయి. ప్రతి రోజు దేశంలోని అనేక ప్రదేశాల్లో అమాయక ప్రజలు మోసపోతున్నారు. దాంతో ముంబై పోలీసులు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలని నిర్ణయించుకున్నారు.
ఇందుకోసం ముంబై పోలీసులు బాలీవుడ్ హిట్ మూవీ కే3జీ (కబీ ఖుషి కబీ గమ్) సినిమా సన్నివేశాన్ని వాడారు. ఈ వీడియోను తమ అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. ఇందులో కాజోల్, ఫరీదా జలాల్ ఉన్న సన్నివేశాన్ని షేర్ చేశారు. దీంతో పాటుగా 'ఎప్పుడూ సైబర్ సేఫ్టీ ఉంటే బాధ పడాల్సిన అవసరం లేదు. థర్డ్ పార్టీ కుకీస్ మీకు హాని కలిగించే అవకాశాలు ఉన్నాయి. వాటిని ఎప్పటికప్పుడు డిలీట్ లేదా అనుమతించకపోవడం మంచిది' అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం ముంబై పోలీసుల వినూత్న ప్రకటన నెట్టింట భలే జోరుగా వైరల్ అవుతోంది.