అగ్రశ్రేణి బ్లూ హైడ్రోజన్ తయారీదారుగా రిలయన్స్

by Disha Desk |
అగ్రశ్రేణి బ్లూ హైడ్రోజన్ తయారీదారుగా రిలయన్స్
X

దిశ, వెబ్‌డెస్క్: ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ దాని ప్రతిష్టాత్మక గ్రీన్-ఎనర్జీ ట్రాన్సిషన్ ప్లాన్‌లో "పోటీ ధర"తో బ్లూ హైడ్రోజన్‌ ఉత్పత్తిదారులలో ఒకటిగా ఉండాలని లక్ష్యంగా పెట్టుకుంది. ముంబైకి చెందిన కంపెనీ ఒక కిలో గ్రాముకి $1.2-$1.5( సమారు రూ. 90-120)కి బ్లూ హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేయడానికి ప్రస్తుతం పెట్రోలియం కోక్‌ను సింథసిస్ గ్యాస్‌గా మార్చే రూ.30,000 కోట్ల ప్లాంట్‌ను పునరుద్దరిస్తుందని తెలిపింది. గ్రీన్ హైడ్రోజన్‌ను క్లియర్ హైడ్రోజన్ అని కూడా పిలుస్తారు. "మధ్యకాలంలో, గ్రీన్ హైడ్రోజన్ ధర తగ్గే వరకు, భారతదేశంలో కనిష్ట పెంపుదల పెట్టుబడితో హైడ్రోజన్ పర్యావరణ వ్యవస్థను స్థాపించే మొదటి మూవర్‌గా రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఉంటుంది" అని కంపెనీ తెలిపింది. 2035 నాటికి కంపెనీ నికర-సున్నా లక్ష్యాన్ని చేధించడానికి ప్రయత్నిస్తున్నందున, డీజిల్, గ్యాసోలిన్ వంటి ఇంధనాల విక్రయాలను గ్రీన్ ఇంధనాలతో భర్తీ చేయాలని యోచిస్తుంది.

Advertisement

Next Story

Most Viewed