- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
రాహుల్ గాంధీని కలిసిన ఎంపీ కోమటిరెడ్డి.. దానిపై ఆందోళన చెందవద్దని భరోసా..!

X
దిశ, భువనగిరి రూరల్: ఏఐసీసీ మాజీ చీఫ్, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని మంగళవారం ఎంపీలు కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు కలిసారు. పార్లమెంట్ సమావేశాలకు హాజరై బయటకు వస్తోన్న సందర్భంలో గేట్ నెంబర్ వన్ వద్ద రాహుల్‌ను నేతలు కలిసారు. ఈ సందర్భంగా వీరితో రాహుల్ గాంధీ కాసేపు ముచ్చటించారు. రాష్ట్రంలోని తాజా పరిస్థితులు అడిగి తెలుసుకున్నారు. ఈ చర్చలో భాగంగా సోనియా, రాహుల్ గాంధీ అపాయింట్మెంట్లు రాష్ట్ర సీనియర్ నేతలకు దొరకడం లేదంటూ సోషల్ మీడియాలో జరుగుతోన్న అసత్య ప్రచారాన్ని రాహుల్ దృష్టికి తీసుకెళ్లగా ఈ విషయంపై స్పందించిన రాహుల్ అలాంటి ప్రచారాలపై ఆందోళన చెందవద్దని భరోసా ఇచ్చినట్టు తెలిపారు. వాటికి సంబంధించిన వివరాలను అందించాలని, ఆ అంశాలను పరిశీలిస్తానని హామీ ఇచ్చినట్టు పేర్కొన్నారు.
Next Story