- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇక ఆఫీసులకు వచ్చేయండి.. ఉద్యోగులకు మెయిల్స్ పంపిస్తున్న MNC`s
దిశ, డైనమిక్ బ్యూరో : కరోనా కారణంగా రెండేళ్లుగా ఇళ్లకే పరిమితమై తీవ్ర పని ఒత్తిడిలో ఉన్న ఐటీ ఉద్యోగులకు కంపెనీలు గుడ్ న్యూస్ చెబుతున్నాయి. వర్క్ ఫ్రం హోమ్‌కు స్వస్థి చెప్పి ఇక ఆఫీసులకు వచ్చేయాలని ఎంఎన్‌సీలు వారి ఉద్యోగులకు మెయిల్స్ పంపిస్తున్నాయి. కొన్ని కంపెనీలు మార్చి 30న ఆఫీసుకు రావాలని మెయిల్ పంపగా.. కొన్ని ఏప్రిల్ 1 నుంచి, మరి కొన్ని మార్చి 25న ఓపెన్ కానున్నాయి. దీంతో రెండేళ్లుగా పని తప్ప మరేదీ లేని ఉద్యోగులకు ఉపశమనం కలగనుంది.
గతంలో ఉద్యోగులకు పని ఒత్తిడి ఉండేది కాదు. కానీ రెండేళ్లుగా టార్గెట్ పెట్టి మరి పని చేయించుకుంటున్నారన్న ఆరపణలు వచ్చాయి. అయితే, తాజాగా కంపెనీల నిర్ణయంతో ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అంతేగాకుండా ఐటీ కంపెనీలన్నీ తెరుచుకుంటే ఎంతో మందికి ఉపాధి లభించనుంది. వేలాది మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా లాభం చేకూరనుంది.