MLA Sanjay Kumar: పోలీస్ అభ్యర్థులకు ఎమ్మెల్యే సంజయ్ గుడ్‌న్యూస్

by GSrikanth |   ( Updated:2022-04-07 05:27:20.0  )
MLA Sanjay Kumar: పోలీస్ అభ్యర్థులకు ఎమ్మెల్యే సంజయ్ గుడ్‌న్యూస్
X

దిశ, జగిత్యాల కలెక్టరేట్: పోలీస్ ఉద్యోగం సాధించేందుకు శిక్షణ తీసుకుంటున్న అభ్యర్థులకు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ గుడ్‌న్యూస్ చెప్పారు. అభ్యర్థులందరికీ అంబలి, రాగి మాల్ట్ అందిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. గురువారం జగిత్యాల పట్టణంలోని ప్రభుత్వ ఎస్‌కేఎన్ఆర్ డిగ్రీ కాలేజీ గ్రౌండ్‌లో వాకింగ్ ట్రాక్ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే కళాశాల క్రీడా మైదానంలో పోలీస్ శిక్షణ పొందుతున్న అభ్యర్థులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా దాదాపు 200 మందికి అంబలి, రాగి మాల్ట్ సౌకర్యం కల్పించాలని అడగడంతో స్పందించిన ఎమ్మెల్యే 60 రోజులకు సరిపడా 1 లక్ష 20 వేల రూపాయల విలువగల అంబలి, రాగి మాల్ట్ అందజేస్తానని హామీ ఇచ్చారు. తక్షణమే స్పందించిన ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. అంతకుముందు వాకింగ్ ట్రాక్ పనులను పరిశీలించారు. పనుల్లో నిర్లక్ష్యంపై అధికారులతో మాట్లాడి త్వరితగతిన వాకింగ్ ట్రాక్ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.

Advertisement

Next Story