రైతు కష్టం ఖాళీ.. కల్లాలో మిర్చి మాయం..

by Javid Pasha |
రైతు కష్టం ఖాళీ.. కల్లాలో మిర్చి మాయం..
X

దిశ, ఖమ్మం రూరల్ : దుండగుల దొంగతనాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. ఇళ్లల్లో, మహిళ మెడలో గొలుసులు, ద్విచక్ర వాహనాలు తదితర వస్తువులను అపహరించే దొంగలు.. అన్నం పెట్టే అన్నదాతలను కూడా వదలడం లేదు. ఓ రైతు సాగు చేసుకున్న మిర్చిని దొంగలించుకు పోయారు. ఈ ఘటన ఖమ్మం రూరల్ మండలం చింతపల్లిలో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఆ గ్రామానికి చెందిన వనపర్ల పుల్లయ్య అనే రైతుకు సుమారు ఎకరం పొలం ఉంది.

ఇది చింతపల్లి ఊరు బయట నుంచి తిరుమల పాలెం, ఆరె కొడుతాండ, ఆరె కోడు వైపునకు వెళ్లే కూడలి వద్ద ఉంది. అందులో సుమారు రూ. 1,50,000 వెచ్చించి ఎకరం మిర్చిని సాగు చేశాడు. 2 రోజుల క్రితం పంటను కోపించి గ్రేడింగ్ కోసం కళ్ళంలో ఉంచాడు. శుక్రవారం తెల్లవారుజామున పొలంలోకి వెళ్లి చూడగా సుమారు నాలుగు క్వింటాల వరకు అపహరణకు గురైంది. దీంతో ఆ రైతు గుర్తు తెలియని వ్యక్తులు మిర్చిని దొంగలించినట్టుగా పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Advertisement

Next Story

Most Viewed