ఆ జిల్లాలో రాష్ట్రంలోనే అతిపెద్ద ఐటీ హాబ్!

by Web Desk |
ఆ జిల్లాలో రాష్ట్రంలోనే అతిపెద్ద ఐటీ హాబ్!
X

దిశ ప్రతినిధి, మేడ్చల్: ఐటీ హాబ్ లు నగరం నలు మూలలా విస్తరిస్తున్నాయి. ఇప్పటి వరకు వెస్ట్ కే పరిమితమైన ఐటి రంగం నార్త్ వైపు విస్తరిస్తోంది. రాష్ట్రంలోనే అతిపెద్ద ఐటీ హాబ్ మేడ్చల్ జిల్లాలోని కండ్ల కోయలో ఏర్పాటు చేయడం విశేషం. 'గేట్ వే ఐటీ హాబ్' పేరిట ప్రభుత్వమే దీన్ని నిర్మిస్తోంది. దాదాపు రూ.250 కోట్ల వ్యయంతో 14 అంతస్థులతో రెండు ట్వీన్ టవర్లను నిర్మిస్తున్నారు. సీఎం కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ నెల 17వ తేదీన గురువారం రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఐటీ హాబ్ కు శంకుస్థాపన చేయనున్నారు.

ఔటర్ పక్కనే..




మేడ్చల్ పట్టణానికి అతి సమీపంలో ఔటర్ రింగ్ 6వ ఎగ్జీట్ గేటు వద్ద భారీ ఐటీ హాబ్ ను ఏర్పాటు చేయబోతున్నారు. ఈ ఐటీ హాబ్ ద్వారా ప్రత్యేక్షంగా 20 నుంచి 25 వేల మంది ఐటీ నిపుణులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. పరోక్షంగా మరో 20 నుంచి 30 వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని టీఎస్ఐఐసీ మేనేజింగ్ డైరెక్టర్ నరసింహారెడ్డి తెలిపారు. 6 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటవుతుందని తెలిపారు.

అయితే ప్రస్తుతం హైటెక్ సీటిలో ఉన్న సైబర్ టవర్ కంటే కండ్ల కోయ ఐటీ టవర్ పెద్దదని ఆయన తెలిపారు. హైటెక్ సిటీలోని సైబర్ టవర్ 5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉండగా, కండ్ల కోయ టవర్ 6 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. ట్వీన్ టవర్స్ లో దాదాపు 150 కంపెనీలు ఏర్పాటు చేయనున్నారు. వీటిలో 80 కంపెనీలకు ఇప్పటికే కేటాయించారు. మిగితా 70 కంపెనీలు ఎంపిక దశలో ఉన్నట్లు అధికారులు తెలిపారు.

Advertisement

Next Story