MG Windsor EV: రికార్డు క్రియేట్ చేసిన ఎంజీ విండ్సర్.. ఒకే నగరంలో ఒకే రోజు 101 కార్లు డెలివరీ..!

by Anjali |
MG Windsor EV: రికార్డు క్రియేట్ చేసిన ఎంజీ విండ్సర్..  ఒకే నగరంలో ఒకే రోజు 101 కార్లు డెలివరీ..!
X

దిశ, వెబ్‌డెస్క్: జెఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటర్(JSW MG motor) రికార్డు క్రియేట్ చేసింది. ఎంజీ విండ్సర్(MG Windsor) 101 యూనిట్ల మెగా డెలివరీ(Mega delivery of 101 units) చేసింది. ఇది భారతదేశపు మొట్టమొదటి ఇంటెలిజెంట్ సీయూవీ(Intelligent SUV) (క్రాస్ఓవర్ యుటిలిటీ వెహికల్)గా పేరు గాంచింది. తమిళనాడు(Tamil Nadu)లోని చెన్నై(Chennai)లో వినియోగదారులకు ఒకే రోజు 101 కార్లను డెలివరీ చేయడం గమనార్హం. చెన్నైలో ఒకే రోజు 101 మంది కస్టమర్లను ఆశ్చర్యపరిచిన ఈ కొత్త కారుకు రోజురోజుకూ డిమాండ్ భారీగా పెరుగుతోంది.

ఈ కారు సెప్టెంబరు(September) 11 వ తేదీన ప్రారంభమైంది. బుకింగ్ ప్రకటించిన ఇరవై నాలుగు గంటల్లోనే 15, 176 బుకింగ్ లను సంపాదించడం అంటే మామూలు విషయం కాదు. గత నెల (అక్టోబరు) మొత్తం ప్యాసింజర్ ఎలక్ట్రిక్ కార్ల(Passenger Electric Cars) అమ్మకాలలో ఎంజీ విండ్సర్(MG Windsor) 30 శాతం వాటాను కలిగి ఉంది. పైగా జెఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటర్ బెస్ట్ ఫీచర్లు కలిగి ఉంది. ప్రీమియం ఇంటీరియర్(Premium interior), స్మార్ట్ కనెక్టివిటీ(Smart connectivity)ఏరోడైనమిక్ డిజైన్(Aerodynamic design), భద్రత(Safety), మంచి డ్రైవింగ్ సౌకర్యంతోపాటుగా ఇతర ఫీచర్లు ఉన్నాయి.

ఎంజీ విండ్సర్‌లోని ఏరో లాంజ్ సీట్లు(Aero lounge seats) మంచి విశ్రాంతిని కలిగిస్తుంది. 604-లీటర్ బూట్ స్పేస్(604-litre boot space) సామాను కోసం స్థలం కూడా విశాలంగా ఉంటుంది. ఈ కారుకు ఒక్కసారి ఛార్జింగ్(charging) పెడితే.. ఏకంగా 332 కిలోమీటర్ల దూరం వెళ్తోంది. దీని ధర 13, 49, 800 నుంచి స్టార్ట్ అవుతుంది.

Advertisement

Next Story

Most Viewed