- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
AP News: CM జగన్‌కు బిగ్ షాక్.. MLA పదవికి సుచరిత రాజీనామా

X
దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది. మంత్రి పదవిపోయి తీవ్ర అసంతృప్తిలో ఉన్న మాజీ హోంమంత్రి మేకతోటి సుచరిత ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. మంత్రివర్గ పునర్వ్యస్థీకరణ సందర్భంగా కొత్త మంత్రుల జాబితాలో తన పేరు లేకపోవడంతో మాజీ హోంమంత్రి మేకతోటి సుచరిత తీవ్ర మనస్తాపానికి గురైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అందరూ అనుకున్నట్లుగానే ఆమె రాజీనామా చేసి రాష్ట్రంలో సంచలనం సృష్టించారు. ఎన్నో ఏళ్లుగా పార్టీని అంటిపెట్టుకుని ఉన్న తమకు అధినేత మొండిచేయి ఇవ్వడం ఏమాత్రం సమంజసంగా లేదని తన అనుచరుల వద్ద వాపోయినట్లు సమాచారం. కాగా, ఆమె ప్రస్తుతం ఉమ్మడి గుంటూరు జిల్లాలోని ప్రత్తిపాడు ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఆమె రాజీనామాతో ఉప ఎన్నికలు అనివార్యం కానున్నాయి.
Next Story