Liger Trailer: విజయ్ విశ్వరూపం.. 'లైగర్' ట్రైలర్ రిలీజ్ చేసిన మెగాస్టార్

by GSrikanth |   ( Updated:2023-05-19 07:11:22.0  )
Megastar Chiranjeevi Releases Telugu Version Of Liger Trailer
X

దిశ, వెబ్‌డెస్క్: Megastar Chiranjeevi Releases Telugu Version Of Liger Trailer| పూరి జగన్నాథ్ - విజయ్ దేవరకొండ కాంబినేషన్‌లో వస్తోన్న ప్రతిష్టాత్మక చిత్రం లైగర్. ఈ సినిమాతో అటు పూరి జగన్నాథ్, ఇటు విజయ్ పాన్ ఇండియాలో ఎంట్రీ ఇస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ఫస్ట్‌లుక్, టీజర్‌కు అభిమానుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. తాజాగా.. చిత్రం నుంచి ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్. తెలుగు ట్రైలర్‌ను మెగాస్టార్ చిరంజీవి విడుదల చేశారు. ట్రైలర్‌లో విజయ్ విశ్వరూపం చూసి అభిమానులు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నారు. ఆగస్టు 25న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. విజయ్ సరసన ఇందులో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే నటిస్తోంది. మరో కీలక పాత్రలో ప్రపంచ బాక్సింగ్ చాంపియన్ మైక్ టైసన్ నటించారు. చార్మి - పూరి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.

Next Story

Most Viewed