మంత్రిని దూషించిన వ్యక్తి రిమాండ్

by S Gopi |
మంత్రిని దూషించిన వ్యక్తి రిమాండ్
X

దిశ, కంటోన్మెంట్: కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి దూషించిన వ్యక్తిని రిమాండ్ కు పంపిన సంఘటన బోయిన్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై సుధాకర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం మంత్రి మల్లారెడ్డి వ్యక్తిగత సహాయకుడు భీమా నారాయణ గత సంవత్సరం ఏప్రిల్ 12న మంత్రి మల్లారెడ్డిని దూషించిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్ ప్రాంతంలోని చింతలకుంటలోని హైవే కాలనీకి చెందిన ఎల్. వెంకట్ రెడ్డి వృత్తిరీత్యా లారీ డ్రైవర్ గా పని చేస్తున్నాడు. గత సంవత్సరం మార్చి 30న, ఏప్రిల్ 11న మంత్రి మల్లారెడ్డి దూషిస్తూ వెంకటరెడ్డి మంత్రి మల్లారెడ్డికి మొబైల్ లో సందేశం పంపాడు. అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని భీమా నారాయణ చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి బుధవారం వెంకట్ రెడ్డిని రిమాండ్ కు తరలించినట్లు ఎస్సై తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed