- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
చికెన్ కోసం వెళ్తుండగా ఒకరు మృతి.. మరొకరి పరిస్థితి విషమం
by S Gopi |

X
దిశ, శామీర్ పేట్: శామీర్ పేట్ పోలీస్ స్టేషన్ సమీపంలో గురువారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరొకరి పరిస్థితి విషమంగా మారింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్ నగర్ కు చెందిన ఆంజనేయులు(34) కుటుంబ సభ్యులతో కలిసి శామీర్ పేట్ పెద్దమ్మ కాలనీలో నివాసం ఉంటున్నాడు. స్నేహితుడైన నర్సింహతో కలిసి శామీర్ పేట్ లోని చికెన్ సెంటర్ వద్ద చికెన్ కోసం వెళ్తున్న క్రమంలో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆంజనేయులు అక్కడిక్కడే మృతి చెందగా, తీవ్ర గాయాలైన నర్సింహను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
- Tags
- Shamirpet
Next Story