- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
వేలాడుతూ కనిపించడంతో షాకైన భార్య.. వెంటనే పక్కింటోళ్లను పిలిచి..

దిశ, మియాపూర్: ఉరివేసుకొని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. ఎస్ఐ రవి కిరణ్ తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన పాత్లావత్ శ్రీను(26) భార్య, పిల్లలతో కలిసి సుభాష్ చంద్రబోస్ నగర్ కాలనీలో నివాసముంటున్నాడు. కాగా శ్రీను ఆటో నడుపుతుండగా భార్య స్థానికంగా ఉన్న ఓ బట్టల షాపులో పని చేస్తున్నది. ప్రతిరోజూ మాదిరిగానే భార్య పనికి వెళ్లింది. శుక్రవారం సాయంత్రం సమయంలో ఇంట్లో ఎవరు లేని సమయంలో శ్రీను ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భార్య సాయంత్రం పని నుంచి ఇంటికి వచ్చి చూడగా శ్రీను ఉరి వేసుకొని వేలాడుతూ కనిపించాడు. వెంటనే పక్కింటివారి సహాయంతో తలపులు బద్దలు కొట్టి చూడగా అప్పటికే శ్రీను మృతిచెంది ఉన్నాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు.