మహేశ్ బాబు ఫ్యామిలీ టూర్.. వైరల్‌గా వెకేషన్ పిక్స్

by Sathputhe Rajesh |
మహేశ్ బాబు ఫ్యామిలీ టూర్.. వైరల్‌గా వెకేషన్ పిక్స్
X

దిశ, సినిమా : 'సర్కారు వారి పాట' సక్సెస్‌ సాధించడంతో సూపర్ స్టార్ మహేశ్ బాబు ఫ్యామిలీతో కలిసి వెకేషన్‌ ఎంజాయ్ చేస్తున్నాడు. భార్యా పిల్లలతో కలిసి స్విట్జర్లాండ్ నుంచి ఇటలీ వరకు, అటు నుంచి యూరప్‌ కూడా చుట్టేస్తున్నాడు. ప్రస్తుతం వీరి వెకేషన్ ముగింపు దశకు చేరుకోగా.. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో భర్త పిల్లలతో సెల్ఫీ పిక్ పోస్ట్ చేసింది నమ్రత. అంతేకాదు 'మిలానోలో చివరి విందు! ఫినామినల్ టేస్ట్‌తో మ్యూజియం మీల్స్! ఈ పిల్లలు మిచెలిన్ మీల్స్‌లో గ్రాడ్యుయేట్ అయ్యారు' అంటూ సదరు ఫొటోకు క్యాప్షన్ జోడించింది. ఇక త్వరలోనే ఇండియా తిరిగిరానున్న మహేశ్.. మళ్లీ షూటింగ్స్‌లో బిజీ కానున్నాడు.


Advertisement
Next Story

Most Viewed