- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
LGBTQ+ కమ్యూనిటీకి ఫ్రీ యూజీ సీట్!
దిశ, ఫీచర్స్: మద్రాస్ విశ్వవిద్యాలయం.. సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు అనుబంధ కళాశాలల్లో రెండు ఉచిత సీట్లను అందిస్తున్న విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా ట్రాన్స్‌జెండర్ల ఉన్నత విద్యను ప్రోత్సహించడమే లక్ష్యంగా ప్రతీ కళాశాలలో ఒక అండర్ గ్రాడ్యుయేట్ సీట్‌ను వారికి ఉచితంగా కేటాయిస్తున్నట్లు మద్రాస్ యూనివర్సిటీ తాజాగా ప్రకటించింది.
సమాజంలో తరచుగా ట్రాన్స్‌జెండర్స్ కమ్యూనిటీ వివక్షకు గురవుతుండగా, లింగం, కులం, లైంగికత లేదా మతంతో సంబంధం లేకుండా పౌరులందరినీ చట్టం ముందు సమానంగా చూడటంలో తమిళనాడు ప్రతీసారి ఇతర రాష్ట్రాలకు నిదర్శనంగా నిలుస్తోంది. ఈ క్రమంలోనే లింగమార్పిడి వ్యక్తులకు ప్రతి కళాశాలలో ఫ్రీ అండర్ గ్రాడ్యుయేట్ సీటు అందిస్తున్నట్లు ప్రకటించగా, 2022 విద్యా సంవత్సరం నుంచి ఇది అమల్లోకి రానుంది. తద్వారా ఉన్నత విద్య ఆధారంగా మంచి ఉద్యోగాన్ని పొందే అవకాశం ఉందని, అనుబంధంగా ఉన్న 131 కళాశాలల్లో ఒక్కో లింగమార్పిడి విద్యార్థికి ఒక్కో సీటు కేటాయిస్తున్నట్లు యూనివర్సిటీ వైస్‌ఛాన్సలర్ ఎస్.గౌరీ తెలిపారు.
ఇక కేరళ కూడా ఇదే విధమైన చొరవ చూపిస్తూ, రాష్ట్ర విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న కళాశాలల్లో అన్ని అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో రెండు సీట్లను కేటాయించింది. అంతేకాకుండా, కమ్యూనిటీకి చెందిన విద్యార్థులు ఏ విధంగానూ వివక్షకు గురికాకుండా చూసేందుకు అన్ని ప్రైవేటు, ప్రభుత్వ కళాశాలలకు అవసరమైన మార్గదర్శకాలను కూడా ప్రభుత్వం జారీ చేసింది.