ఒక్క ఫైట్ కోసం రూ.10 కోట్లు.. రాంచరణ్ సినిమా బిగ్ అప్ డేట్

by Javid Pasha |
ఒక్క ఫైట్ కోసం రూ.10 కోట్లు..  రాంచరణ్ సినిమా బిగ్ అప్ డేట్
X

దిశ, వెబ్‌డెస్క్: మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉన్నాడు. 'ఆర్ఆర్ఆర్' మూవీ రిలీజ్ అవ్వడానికి ముందే చెర్రీ తన తదుపరి సినిమాను మొదలు పెట్టేశాడు. సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో చెర్రీ తన 15వ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాను శంకర్ భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాపై ఇప్పటికే అనేక వార్తలు నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. అయితే తాజాగా ఈ సినిమా నుంచి మరో అదిరిపోయే అప్‌డేట్ వచ్చింది.

ఈ సినిమాలో రామ్ చరణ్ యాక్షన్ సీక్వెన్స్‌కు ఏమాత్రం కొదవ ఉండదని ఇప్పటికే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ మూవీలో ఒక్క ఫైట్ కోసం మేకర్స్ దాదాపు రూ.10 కోట్లు ఖర్చు చేశారట. ఇందులో చెర్రీ స్టంట్స్, షాట్స్ అన్నీ కూడా అద్భుతంగా ఉండనున్నాయట. దీంతో పాటుగా ఒక పాట కోసం రూ.9.3 కోట్లు బడ్జెట్ పెట్టారని నెట్టింట వార్తలు తెగ హల్‌చల్ చేస్తున్నాయి. కానీ ఇప్పటి వరకు వీటిపై ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. మరి త్వరలో మేకర్స్ ఈ వార్తలపై క్లారిటీ ఇస్తారేమో చూడాలి.

Advertisement

Next Story

Most Viewed