అదిరిపోయిన 'రంగమార్తాండ' టైటిల్ లోగో.. నెక్స్ట్ మంత్ రిలీజ్

by S Gopi |
అదిరిపోయిన రంగమార్తాండ టైటిల్ లోగో.. నెక్స్ట్ మంత్ రిలీజ్
X

దిశ, సినిమా : హౌస్ ఫుల్ మూవీస్, రాజశ్యామల ఎంటర్త్సైన్మెంట్స్ బ్యానర్ పై క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'రంగమార్తాండ'. ఇళయరాజా సంగీతం సారధ్యంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమా టైటిల్ లోగోను ఆవిష్కరించారు మూవీ యూనిట్ సభ్యులు. ప్రకాశ్ రాజ్, బ్రహ్మానందం, రమ్యకృష్ణ, రాహుల్ సిప్లిగంజ్, ఆదర్శ్ బాలకృష్ణ, అలీ రేజా, అనసూయ, శివాత్మిక రాజశేఖర్, తదితరులు నటించిన సినిమా టీజర్ , ట్రైలర్ త్వరలో విడుదల కానున్నట్లు తెలిపారు. ఆగస్టులో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుండగా.. మన అమ్మానాన్నల కథగా 'రంగమార్తాండ' థియేటర్స్ కు రానుందని, ఫ్యామిలీ ఎమోషన్స్‌తో అన్ని వర్గాల ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుందన్నారు మేకర్స్.

Advertisement

Next Story