‘క’ ట్రైలర్ విడుదల తేదీ అనౌన్స్ చేసిన కిరణ్ అబ్బవరం.. ఆసక్తి పెంచుతున్న పోస్ట్

by Hamsa |   ( Updated:2024-10-22 11:42:52.0  )
‘క’ ట్రైలర్ విడుదల తేదీ అనౌన్స్ చేసిన కిరణ్ అబ్బవరం.. ఆసక్తి పెంచుతున్న పోస్ట్
X

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram), సుజిత్, సందీప్ కాంబోలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ ‘క’(KA). 1970లో ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణగిరి బ్యాక్ డ్రాప్‌లో సాగే పీరియాడిక్ థ్రిల్లర్‌గా రాబోతున్న ఈ సినిమాలో నయన్ సారిక హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే దీనిని వరలక్ష్మి (Varalakshmi)సమర్పణలో శ్రీచక్రాస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్‌పై నిర్మిస్తున్నారు. ఇప్పటికే ‘క’ (KA)చిత్రం నుంచి విడుదలైన అప్డేట్స్ హైప్ పెంచాయి. అయితే ఈ మూవీ దీపావళి కానుకగా అక్టోబర్ 31న థియేటర్స్‌లో విడుదల కాబోతుంది.

రిలీజ్ తేదీ దగ్గర పడటంతో ‘క’ మూవీ మేకర్స్ ప్రమోషన్స్ స్టార్ట్ చేసి అప్డేట్స్ విడుదల చేస్తున్నారు. తాజాగా, ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ అక్టోబర్ 24న విడుదల కాబోతున్నట్లు ఇన్స్‌స్టాగ్రామ్ వేదికగా కిరణ్ అబ్బవరం ఓ పోస్ట్ పెట్టాడు. అందులో డార్క్ షేడ్స్‌లో ఎండిన చెట్ల మధ్యలో అనుమానాస్పద ఆకారం.. దానిపై గొడ్డలి లాంటి ఆయుధం నీడ కనిపిస్తున్న విజువల్స్ సినిమాపై ఆసక్తిని పెంచేస్తున్నాయి. మిస్టరీ థ్రిల్లర్‌గా ఉండబోతున్నట్లు అర్థమవుతోంది.

Advertisement

Next Story