- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Karthika Deepam October 22 : ప్రేమతోనే దీపమెడలో తాళి కట్టా అంటూ అందరికీ షాక్ ఇచ్చిన కార్తీక్ బాబు
దిశ, వెబ్ డెస్క్ : కార్తీక దీపం ( Karthika Deepam) ఈ రోజు సీరియల్ ఎపిసోడ్ లో ఈ సీను హైలెట్
కార్తీక్ ఇంటి సభ్యులు దీపను ఇంట్లో నుంచి గెంటేస్తారు.. ఆమె కింద పడిపోబోతుంటే.. కార్తీక్ స్పీడ్ గా వచ్చి పట్టుకుంటాడు. అప్పుడు అందరూ షాక్ అయి నిలబడి చూస్తారు. వాళ్ల వైపు కోపంగా చూస్తూ.. ‘సొంత అల్లుడు చిన్న తప్పు చేశాడని కన్న కూతుర్ని, మనవడిని కూడా వద్దనుకున్న కుటుంబం ఇది. నువ్వు ఇప్పుడొచ్చి జరిగింది చెబితే వీళ్ళు అర్థం చేసుకుంటారనుకున్నావా.. ? అసలు నువ్వు ఇక్కడికి ఎందుకొచ్చావ్ దీప.. ఇక్కడికి వస్తే నీకు ఇలాగే జరుగుతుందని నాకు ముందే తెలుసు దీపా’ అని కార్తీక్ అంటాడు. అప్పుడు శివనారాయణ ఆపరా ఇక .. నా ఇంటి ముందు నిలబడి నన్నే ఇష్టమొచ్చినట్టు మాటలు అంటావా .. అరుస్తాడు. నేను ఏమైనా తప్పు మాట్లాడానా .. ఉన్నదే కదా చెప్పింది, ఎందుకంత ఎగిరిపడుతున్నావ్ అని కార్తీక్ అంటాడు. నువ్వు, మీ నాన్న ఏమైనా గొప్ప పనులు చేశారా .. మీకు సన్మానాలు చేయడానికి.. చేసిందే తప్పుడు పని మళ్ళీ నువ్వు మాకు నీతులు చెబుతున్నావ్ అని అంటాడు శివనారాయణ ఇక్కడితో ఈ సీన్ ముగుస్తుంది.
ప్రేమతోనే దీపమెడలో తాళి కట్టా..
తాతా.. మా నాన్నను తప్పుబట్టు.. నేను ఏమి అనుకోను ఎందుకంటే నీ కూతురికి సరైన న్యాయం చేయలేదు. కానీ, నేను ఏ రోజు ఎవరికీ కూడా ఎలాంటి అన్యాయం చేయలేదు. మీరే మమ్మల్ని వద్దనుకున్నారు. మీరే మమ్మల్ని పో అన్నారని కార్తీక్ అంటాడు . అయితే, తాత క్షమించకపోతే ఇలా కోపంతో దీప మెడలో తాళి కట్టావా బావ అని కార్తీక్ ని, జ్యోత్స్న నిలదీసి అడుగుతుంది. చెప్పు బావ ప్రేమతోనా ఇదంతా చేశావా అంటూ జ్యోత్స్న అడగ్గా.. అవును అని అంటాడు కార్తీక్. దాంతో అందరూ షాకవుతారు. శౌర్యకు తండ్రి కావాలని ఆశతో దీప మెడలో తాళి కట్టానంటూ అందరి ముందు గట్టిగా అరిచి కార్తీక్ చెబుతాడు.