ఆ ముగ్గురు మహిళలే అంతటికీ కారణం.. కరీనా కపూర్

by sudharani |
ఆ ముగ్గురు మహిళలే అంతటికీ కారణం.. కరీనా కపూర్
X

దిశ, సినిమా : బాలీవుడ్ నటి కరీనా కపూర్ త్వరలో చిత్ర నిర్మాత రియా కపూర్‌తో కలిసి ఓ సినిమా చేయనున్నట్లు ప్రకటించింది. అయితే ఇంతకుముందు వీరిద్దరూ కలిసి 2018లో వచ్చిన 'వీరే ది వెడ్డింగ్‌'కు పనిచేయగా.. ఇప్పుడు రాబోతున్న చిత్రం ఇందుకు సీక్వెల్ కాదని స్పష్టం చేసింది. అలాగే తమ రాబోయే ప్రాజెక్ట్ ఎవరూ ఊహించనంత భిన్నంగా ఉండబోతున్నట్లు తెలిపిన నటి.. దీని కథ పూర్తిగా ముగ్గురు మహిళలపై ఆధారపడి ఉంటుందని చెప్పింది. అలాగే ఈ ఏడాది చివర్లో లేదా 2023 ప్రారంభంలో చిత్రీకరణ ప్రారంభించబోతున్నట్లు వెల్లడించిన కరీనా.. ఈ సినిమాను 'సూపర్ కూల్ అండ్ ఫన్ స్టోరీ'గా పేర్కొంది. చివరగా చిత్రబృందం నటీనటులను కూడా సెలక్ట్ చేసిందని, ఇద్దరు స్టార్ నటులు కీలక పాత్రలు పోషించబోతుండటంతో ఎగ్జయిటింగ్‌గా ఉందని చెప్పింది.

Advertisement

Next Story