- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Vijay69 సినిమాలో కన్నడ స్టార్.. కన్ఫర్మ్ చేస్తూ ఆసక్తికర కామెంట్స్

దిశ, సినిమా: తమిళ స్టార్ హీరో దళపతి విజయ్(Thalapathy Vijay) నటిస్తున్న చివరి సినిమా ‘విజయ్69’. ఎందుకంటే.. ఆయన వచ్చే ఏడాది రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. దీనికి H. వినోద్(Vinod) దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో పూజా హెగ్డే(Pooja Hegde) హీరోయిన్‌గా నటిస్తుండగా.. ప్రియమణి, మమిత బైజు(Mamita Baiju), బాబీ డియోల్, నటుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్(Gautham Vasudev Menon) కీలక పాత్రలో కనిపించనున్నారు. విజయ్ లాస్ట్ సినిమా కావడంతో ‘విజయ్-69’ కోసం ఫ్యాన్స్ కళ్లు కాయలు కాసేలా వెయిట్ చేస్తున్నారు.
ఈ క్రమంలో.. తాజాగా, ఈ మూవీలో ఓ కన్నడ స్టార్(Kannada Star) హీరో నటిస్తున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో.. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శివ రాజ్ కుమార్(Shiva Raj Kumar) దీనిపై క్లారిటీ ఇస్తూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ‘‘విజయ్-69(Vijay-69)లో నాకు ఆఫర్ వచ్చింది. ఓ అద్భుమైన క్యారెక్టర్ కోసం నా వద్దకు వచ్చారు. నేను కథ విన్నాక ఓకే చెప్పాను. అయితే నా డేట్స్ అడ్జెస్ట్‌మెంట్ ప్రకారం నా క్యారెక్టర్ ఎలా డిజైన్ చేస్తారో తెలియదు. విజయ్ చాలా మంచి నటుడు. అతను సినిమాలు చేస్తూనే ఉండాలని నా కోరిక’’ అని చెప్పుకొచ్చారు. దీంతో ఈ మూవీపై అంచనాలు భారీ పెరిగిపోయాయి.