- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కళ్యాణ్ జ్యువెలర్స్ ఛైర్మన్‌గా మజీ కాగ్ వినోద్ రాయ్ నియామకం!
న్యూఢిల్లీ: దేశీయ ప్రముఖ బంగారు ఆభరణాల సంస్థ కళ్యాణ్ జ్యువెలర్స్ ఇండియా ఛైర్మన్‌గా మాజీ కాగ్ వినోద్ రాయ్‌ను నియమిస్తున్నట్టు సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది. అలాగే, కంపెనీ బోర్డు నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా కూడా ఉంటారని కళ్యాణ్ జ్యువెలర్స్ వెల్లడించింది. వినోద్ రాయ్ మాజీ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్)గా బాధ్యతలు నిర్వహించారు. ఈ నియామకం నియంత్రణ సంస్థ, వాటాదారుల ఆమోదాలకు లోబడి ఉంటుందని స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో కంపెనీ పేర్కొంది. ఆయన నియామకానికి షేర్ హోల్డర్ల నుంచి ఆమోదం లభించాల్సి ఉంది.
కళ్యాణ్ జ్యువెలర్స్ ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించడం పట్ల సంతోషంగా ఉందని వినోద్ రాయ్ అన్నారు. మెరుగైన పారదర్శకత, విలువలతో కొనసాగుతున్న కళ్యాణ్ జ్యువెలర్స్‌తో భాగస్వామ్యం కావడం ఆసక్తిగా ఉందన్నారు. వినోద్ రాయ్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలో వివిధ పదవులకు బాధ్యతలు నిర్వర్తించారు. ముఖ్యంగా వివిధ సంస్కరణలలో కీలక పాత్ర పోషించారు. దేశంలో ప్రభుత్వ రంగ బ్యాంకులను సంస్కరించడం కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన బ్యాంక్స్ బోర్డు బ్యూరో ఛైర్మన్‌గా కూడా పనిచేశారు. ఆయన భారత ప్రభుత్వం నుంచి పద్మభూషణ్ సైతం అందుకున్నారు. కాగా, కళ్యాణ్ జ్యువెలర్స్ మేనేజింగ్ డైరెక్టర్‌గా కళ్యాణరామన్ కొనసాగుతారని కంపెనీ వెల్లడించింది.