రైతు భరోసా కేంద్రాలు పెద్ద స్కాం: జనసేన నేత నాదెండ్ల మనోహర్

by Web Desk |
nadendla manohar
X

దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రంలోని సమస్యలపై ప్రభుత్వం కపట వైఖరితో వ్యవహరిస్తోందని జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్‌ మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రైతులు యూరియా కోసం సతమతమవుతున్నారని, రైతు భరోసా కేంద్రాలు ఎందుకు ఏర్పాటు చేశారని ప్రశ్నించారు. రైతు భరోసా కేంద్రాలు పెద్ద స్కాం అని పేర్కొన్నారు.

సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వంలో అనేక మంది సలహాదారులున్నా పరిష్కారం ఎందుకు జరగడం లేదని ప్రశ్నించారు. సమస్యను సృష్టించేది రాష్ట్ర ప్రభుత్వమేనని ఆరోపించారు. రెండు నెలలుగా ఉద్యోగులను హింసించి ఇబ్బందులు పెడుతున్నారని ధ్వజమెత్తారు. అన్ని శాఖలకు సలహాదారుడిగా వ్యవహరిస్తున్న సీఎం ప్రధాన సలహాదారుడికి ఉద్యోగులు, రైతుల సమస్యలు ఎందుకు అర్థం కావడం లేదని మండిపడ్డారు.

సినీ ప్రముఖులకు ఇచ్చిన సమయం వారిపై చూపిన శ్రద్ధ ఏండ్ల తరబడి ఉద్యమం చేస్తున్న అమరావతి రైతులను ఎందుకు పట్టించుకోవడం లేదని ఆయన నిలదీశారు. రాష్ట్రంలో విద్యా, వైద్యం నిరుద్యోగ, ఇసుక సమస్యల‌పై సీఎం జగన్ స్పందించటం లేదన్నారు. మూడేళ్లు అవుతున్నా కీలక అంశాలపై ఒక్క ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా ఏర్పాటు చేయని ముఖ్యమంత్రి మాత్రమే అంటూ ఎద్దేవా చేశారు. సీఎం సహాయ నిధిలో వందల కోట్ల స్కాం జరిగిందని పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed