AP News: 'నాకు మంత్రి పదవి రాకపోవడానికి కారణం వారే'.. ఎమ్యెల్యే ఉదయభాను కీలక వ్యాఖ్యలు

by Satheesh |   ( Updated:2022-04-11 10:22:25.0  )
AP News: నాకు మంత్రి పదవి రాకపోవడానికి కారణం వారే.. ఎమ్యెల్యే ఉదయభాను కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో క్యాబినెట్ విస్తరణ సీఎం జగన్‌కు కొత్త తలనొప్పి తెచ్చింది. మంత్రి పదవి ఆశించి భంగపడ్డ నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇప్పటికే మాజీ హోంమంత్రి సుచరిత ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. మరోసారి మంత్రి వర్గంలో చోటుదక్కకపోవడంతో మాజీమంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.

తమ నేతలకు మంత్రి పదవి దక్కకపోవడంతో వైసీపీ కార్యకర్తలు ఏపీ రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆందోళనలు చేస్తున్నారు. తాజాగా మంత్రి పదవి ఆశించి భంగపడ్డ ఎమ్మెల్యే ఉదయభాను కీలక వ్యాఖ్యలు చేశారు. 'సీఎం జగన్ చుట్టూ ఓ కోటరీ ఉంది. ఆ కోటరీ వల్లే నాకు మంత్రి పదవి రాలేదు. కృష్ణా జిల్లాలో వైసీపీలోకి ముందుగా వచ్చింది నేనే.. సీనియర్‌గా నాకు మంత్రి పదవి వస్తుందని ఆశించా కానీ రాలేదు. అయిన సీఎం జగన్ నిర్ణయం మేరకు నడుచుకోవడానికి సిద్ధం' అని అన్నారు.

Next Story

Most Viewed