- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బీజేపీకి ఈటల షాక్.. రిజర్వేషన్ల బిల్లుపై టీఆర్ఎస్‌కు సపోర్ట్
దిశ, డైనమిక్ బ్యూరో : హుజురాబాద్ ఎమ్మెల్యే, బీజేపీ నేత ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అనూహ్యంగా టీఆర్ఎస్‌కు సపోర్ట్ చేస్తూ మాట్లాడారు. కేంద్ర గిరిజన శాఖ సహాయమంత్రి బిశ్వేశ్వర్.. పార్లమెంట్‌లో ఎస్టీ రిజర్వేషన్లను 12 శాతానికి పెంచాలంటూ తెలంగాణ ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రతిపాదనలు రాలేదని చెప్పిన విషయం తెలిసిందే. కానీ, మంత్రి హరీష్ రావు, ఇతర టీఆర్ఎస్ పార్టీ ప్రతినిధులు మాత్రం.. రిజర్వేషన్లపై లేఖలు రాస్తూనే ఉన్నామని చెప్పుకొచ్చారు. అంతేగాకుండా, కేంద్ర మంత్రి బిశ్వేశ్వర్ భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ లోక్‌సభలో ప్రివిలేజ్ నోటీసులు కూడా ఇచ్చారు. దీనిపై రాష్ట్ర బీజేపీ నేతలు సైతం కేంద్రానికి వత్తాసు పలుకగా.. ఆ పార్టీ ఎమ్మెల్యే అయిన ఈటల రాజేందర్ మాత్రం రిజర్వేషన్ల బిల్లు కేంద్రానికి పంపారని ప్రకటించారు. కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది వాస్తవమేనని, కానీ పంపినదాంట్లో కేంద్రం వేసిన ప్రశ్నలకు రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పిందా లేదా? అన్నది రాష్ట్ర ప్రభుత్వానికి తెలియాలన్నారు. ఇవన్నీ ప్రజల కళ్లల్లో మట్టి కొట్టేందుకేనని, రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను గొర్రెలు అనుకుంటుందని.. ఏది చెప్పినా నమ్ముతారు అనుకొని ఇతరుల మీద నెట్టేందుకే ఈ గిరిజనుల రిజర్వేషన్ ఇష్యూని ముందుకు తీసుకొచ్చారని ఈటల మండిపడ్డారు.