స్టార్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి రెండో పెళ్లి చేసుకోబోయేది ఆమెనేనా.. నెట్టింట చక్కర్లు కొడుతోన్న ఫొటో

by Kavitha |   ( Updated:2024-11-09 05:32:30.0  )
స్టార్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి రెండో పెళ్లి చేసుకోబోయేది ఆమెనేనా.. నెట్టింట చక్కర్లు కొడుతోన్న ఫొటో
X

దిశ, సినిమా: స్టార్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి(Krish Jagarlamudi) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తనదైన శైలిలో సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. అలా వేదం(vedam), గమ్యం(gamyam), మణికర్ణిక(Manikarnika), గౌతమి పుత్ర శాతకర్ణి(gouthami puthra shathakarni) వంటి సినిమాలకు దర్శకత్వం వహించారు. ఇక చివరిగా వైష్ణవ్ తేజ్(Vaishnav Tej) హీరోగా రకుల్ ప్రీత్ సింగ్(Rakul Preeth Sing) హీరోయిన్‌గా నటించిన ‘కొండపొలం’(Konda Polam) మూవీకి దర్శకత్వం వహించిన ఈయన.. ‘హరిహర వీరమల్లు’(Harihara Veeramallu) సినిమా చేస్తూ తప్పుకున్నాడు. ప్రస్తుతం క్రిష్.. స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి(Anushka Shetty) ప్రధాన పాత్రలో ‘ఘాటీ’(Ghaati) సినిమా చేస్తున్నారు. దీనికి సంబంధించిన అప్డేట్ కూడా తాజాగా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే.

ఇదిలా ఉంటే.. క్రిష్ జాగర్లమూడి కొన్నాళ్ల క్రితం రమ్య అనే ఒక డాక్టర్‌ని పెళ్లి చేసుకున్నాడు. అయితే వీరి వివాహ బంధంలో కొన్ని మనస్పర్థలు రావడంతో 2018లో మ్యూచువల్ డివోర్స్ తీసుకున్నారు. ఇక ఇప్పుడు అందిన తాజా సమాచారం ప్రకారం క్రిష్ ఈ నెల 10న రెండో పెళ్లి చేసుకోబోతున్నట్లు సినీ వర్గాలు తెలిపాయి. హైదరాబాద్‌కు చెందిన గైనకాలజిస్ట్ డా. ప్రీతి చల్లాతో ఆయన వివాహం జరగనున్నట్లు సమాచారం. ఈ నెల 16న జరిగే రిసెప్షన్‌కు సినీ ప్రముఖులు హాజరవుతారని టాలీవుడ్ వర్గాలు పేర్కొన్నాయి. అయితే ఇప్పుడు వధువుకు సంబంధించిన ఫొటో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. అసలు వధువు ఆమెనో కాదో తెలియాలంటే పెళ్లి ఫొటోలు వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.

Advertisement

Next Story

Most Viewed