అంతర్జాతీయ గ్రహశకల దినోత్సవం..

by Manoj |
అంతర్జాతీయ గ్రహశకల దినోత్సవం..
X

దిశ, ఫీచర్స్: అంతర్జాతీయ గ్రహశకల దినోత్సవం(ఆస్టరాయిడ్ డే) ప్రతి ఏటా జూన్ 30న నిర్వహించబడుతుంది. 1908, జూన్ 30న రష్యా సమాఖ్య, సైబీరియా స్టోనీ తుంగస్కా నది సమీపంలో కూలిన గ్రహశకలం ప్రభావానికి గుర్తుగా ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ రోజున ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో గ్రహాల గురించి అవగాహన కార్యక్రమాలు చేపడతారు.

ఇక భూమిపై అత్యంత హానికరమైన గ్రహశకలానికి సంబంధించిన ఈ ఘటనలో దాదాపు 2,072 చ‌.కి.మీ. విస్తీర్ణంలో అటవీ ప్రాంతం నాశ‌నమైంది. దీంతో స్టీఫెన్ హాకింగ్, చిత్రనిర్మాత గ్రిగోరిజ్ రిక్టర్స్, బి 612 ఫౌండేషన్ ప్రెసిడెంట్ డానికా రెమి, అపోలో 9 వ్యోమగామి రస్టీ ష్వీకార్ట్, ఖగోళ భౌతిక శాస్త్రవేత్త బ్రియాన్ 'ఆస్టరాయిడ్ డే' ప్రతిపాదనను తీసుకురాగా.. వ్యోమగాములు, శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులు, కళాకారుల మద్దతుతో 2014, డిసెంబరు 3న ఐక్యరాజ్య సమితిచే అధికారికంగా ప్రకటించబడింది.

Advertisement

Next Story