- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దేశంలోనే తొలి జాయింట్ రీప్లేస్‌మెంట్ మ్యూజియం ప్రారంభం!
దిశ, ఫీచర్స్ : భారతదేశపు మొట్టమొదటి ఆర్థ్రోప్లాస్టీ (జాయింట్ రీప్లేస్‌మెంట్) మ్యూజియాన్ని ఇండియన్ సొసైటీ ఆఫ్ హిప్ అండ్ నీ సర్జన్స్ (ISHKS) అహ్మదాబాద్‌లో ప్రారంభించారు. భారతదేశంలో జాయింట్ రీప్లేస్‌మెంట్ శస్త్రచికిత్స ప్రారంభ రోజుల నుంచి మోకాలి, తుంటి మార్పిడి శస్త్రచికిత్స పరిణామాన్ని సంగ్రహించే ప్రస్తుత కాలం వరకు జాయింట్ ఇంప్లాంట్లకు సంబంధించిన అమూల్యమైన, అరుదైన రిపోజిటరీని ఈ మ్యూజియం ప్రదర్శిస్తుంది.
మోకాలి, తుంటి మార్పిడి శస్త్రచికిత్స రంగంలో వస్తున్న మార్పులతో పాటు వైద్యుల ఆలోచనలు, బెస్ట్ ప్రాక్టీసెస్ వంటి అంశాలను పంచుకునేందుకు వీలుగా 2004లో ఇండియన్ సొసైటీ ఆఫ్ హిప్ & నీ సర్జన్స్ (ISHKS) ఏర్పడింది. అహ్మదాబాద్‌లోని ఈ ఎన్‌జీవో భారతదేశంలో జాయింట్ రీప్లేస్‌మెంట్ సర్జరీల రిజిస్ట్రీని కూడా నిర్వహిస్తుంది. ఇందులోని సభ్యులు దాదాపు 2.5 లక్షల కీళ్లపై స్టడీ చేసిన డాక్యుమెంట్‌ను నేషనల్ హెల్త్ అథారిటీ గుర్తించడం విశేషం. ఇక ప్రస్తుతం ప్రారంభించిన మ్యూజియం యంగ్ సర్జన్లకు ఎంతో సహాయకరంగా ఉంటుందన్నారు నిర్వాహకులు. యంగ్ జాయింట్ రీప్లేస్‌మెంట్ సర్జన్స్ సహా ప్రొఫెసర్స్, విద్య, పరిశోధన కార్యకలాపాల కోసం పరిశోధకులకు మ్యూజియంలో గొప్ప సమాచారం అందుబాటులో ఉంటుందని, ప్రదర్శనలలో ఐదు దశాబ్దాలుగా వివిధ రకాల జాయింట్ ఇంప్లాంట్లు ఉన్నాయని మ్యూజియం క్యూరేటర్ డాక్టర్ జెఎ పచోర్ చెప్పారు. ఇక ప్రభుత్వ సెలవు దినాల్లో మినహా సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం 11 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ మ్యూజియం తెరిచి ఉంటుంది.