- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
అధిష్టానం ఆదేశిస్తే అక్కడి నుంచి పోటీ చేస్తా: అజారుద్దీన్
దిశ, కామారెడ్డి రూరల్ : పార్టీ అధిష్టానం ఆదేశిస్తే ఎన్నికల్లో కామారెడ్డి నుంచి కూడా పోటీ చేస్తానని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ క్రికెటర్ అజారుద్దీన్ తెలిపారు. ఆదివారం కామారెడ్డి పట్టణంలోని పార్శీ రాములు కళ్యాణ మండపంలో మదన్ మోహన్ రావు ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా జాబ్ మేళాకు ముఖ్య అతిథిగా హాజరైన అజారుద్దీన్ మాట్లాడుతూ.. నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఎంతో మంది ఉద్యోగులు ఉన్నారని తెలిపారు.
కామారెడ్డిలో మదన్ మోహన్ రావు ట్రస్ట్ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించడం అభినందనీయమన్నారు. పెరుగుతున్న ధరలు పేదల మీద భారం మోపిందని, పెంచిన విద్యుత్ ధరలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. పెట్రో డీజిల్ ధరలపై సబ్సిడీ ఇవ్వాలని, పార్టీ ఆదేశాల మేరకు 6 వ తేదీన కలెక్టర్ కార్యాలయాల ముందు ధర్నా చేస్తామని చెప్పారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించే దిశగా అడుగులు వేస్తామని పేర్కొన్నారు.