- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఈసారి రాష్ట్రంలో రాబోయే పార్టీ ఇదే.. తేల్చి చెప్పేసిన ఎంపీ

దిశ, హన్వాడ : రాష్ట్రంలో, దేశంలో ఒకే ప్రభుత్వం ఉంటేనే అభివృద్ధి సాధ్యం అవుతుందని, తెలంగాణలో బిజెపి ప్రభుత్వం గెలుపు అనివార్యం ఆవశ్యకం కూడా అని ఎంపీ డీకే అరుణ అన్నారు. గురువారం హన్వాడ మండలం వేపూర్, టంకర గ్రామాల్లో మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డితో కలిసి ఎంపీ డీకే అరుణ సీసీ రోడ్లను ప్రారంభించారు. అనంతరం వేపూర్ గ్రామంలో డీకే అరుణ బీజేపీ జెండా ఆవిష్కరించారు. ఎంపి డీకే అరుణకు స్థానిక బీజేపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు.
అనంతరం డీకే అరుణ మాట్లాడుతూ.. ఇచ్చిన హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని, చేతకాని హామీలు ఇచ్చి ఇప్పుడు అమలు చేయమంటే డబ్బులు లేవు అంటున్నారని ఆమె ఏద్దేవా చేశారు. ఆరోజు హామీలు ఇచ్చే రోజు గుర్తులేదా రాష్ట్రంలో డబ్బులు లేవని, హామీల పేరుతో ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ కు ప్రజలే తగిన గుణపాఠం చెప్పాలని కోరారు. తను ఎంపీగా గెలిచాకే హన్వాడ మండలానికి అభివృద్ధి నిధులు తెచ్చానని అన్నారు. రేపు తెలంగాణలో కూడా బిజెపి అధికారంలోకి వస్తే మరిన్ని నిధులతో ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందని డీకే అరుణ అన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేసే అన్ని పథకాలు ప్రజల్లోకి చేరాలంటే తెలంగాణ లో బిజెపి అధికారంలోకి రావాలి అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ, కర్ణాటక తప్ప దేశంలో ఎక్కడా లేదని ఆమె అన్నారు. వచ్చే ప్రతి ఎన్నికల్లో బిజెపికి ఓటేస్తే అభివృద్ధి బాధ్యత మేము తీసుకుంటాం అని ఆమె ప్రజలకు హామీ ఇచ్చారు.
తెలంగాణలో బిజెపికి గెలిపిస్తే మీకు అవసరమైన నిధులు తీసుకొచ్చే బాధ్యత నాది అని డీకే అరుణ అన్నారు. ఇందిరమ్మ ఇల్లు పేరుతో కాంగ్రెస్ పార్టీ మరోసారి ప్రజలను మోసం చేస్తుంది. కేంద్రం ఇళ్లకు నిధులుస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం మేమే ఇస్తున్నాం అని డ్రామాలాడుతున్నాయి. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు ఇవ్వాల్సిందే అని డీకే అరుణ అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, పద్మజారెడ్డి, బీజేపీ మండల అధ్యక్షుడు డా, వెంకటయ్య, నాయకులు కొండా లింగన్న, రఘురాం గౌడ్, రమణారెడ్డి, వడ్ల శేఖర్, కృష్ణయ్య గౌడ్ , పి. రాములు, రాఘవేందర్ గౌడ్, పి. వెంకట్రాములు, భూపతిరెడ్డి, భగవంతు, కోస్గి రాజు తదితరులు పాల్గొన్నారు.