వాళ్లు క్షేమంగా ఉండాలని రోజూ దేవుడిని ప్రార్థిస్తా.. శివ కార్తికేయన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

by Hamsa |   ( Updated:2024-10-25 15:05:37.0  )
వాళ్లు క్షేమంగా ఉండాలని రోజూ దేవుడిని ప్రార్థిస్తా.. శివ కార్తికేయన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: కోలీవుడ్ హీరో శివ కార్తికేయన్(Shiva Karthikeyan), సాయి పల్లవి కాంబోలో రాబోతున్న తాజా చిత్రం ‘అమరన్’. ఈ సినిమాను రాజ్ కుమార్ పెరియసామి(Raj Kumar Periasamy) తెరకెక్కిస్తుండగా.. దీపావళి కానుకగా అక్టోబర్ 31న థియేటర్స్‌లో విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో శివ కార్తికేయన్ ప్రమోషన్స్‌లో భాగంగా వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ ఫుల్ బిజీగా గడుపుతున్నారు. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో ఆయన ఆసక్తికర కామెంట్స్ చేశారు. ‘‘అమరన్ సినిమా కోసం నేను కొందరు మి,లటరీ అధికారులతో కొన్ని రొజులు ఉన్నాను. వారంతా తమ కుటుంబాలకు దూరంగా ఉండి ఎంత కష్టపడుతున్నారో నాకు చెప్పారు.

అయితే ఈ మూవీలో రాష్ట్రీయ రైఫిల్ దళాన్ని చూపించాం. ఒక రోజు నేను అక్కడ ఉండగానే కొందరు ఇంటెలిజెన్స్ సమాచారం అందుకొని మిషన్‌కు వెళ్లారు. వాళ్లతో కొన్నిరోజులు గడిపాను కాబట్టి ఈ మిషన్‌కు వెళ్లినవారంతా క్షేమంగా తిరిగి రావాలని కోరుకున్నాను. వాళ్లు క్షేమంగా ఉండాలని రోజూ దేవుడిని ప్రార్థించాను. అయితే వారు వచ్చాక ఒక అధికారి మరణించినట్లు చెప్పారు. ఒక రాత్రి వాళ్లను ఎంత భాదించిందో వివరించారు. మిషన్ తర్వాత నుంచి రాష్ట్రీయ రైఫిల్‌లోని అధికారులంతా మానసికంగా ఎంతో ధృఢంగా మారారు. వారు ఎప్పుడు మిషన్‌కు వెళ్తారో వెళ్లిన వారిలో ఎంతమంది తిరిగి వస్తారో తెలియదు. అయితే మిషన్‌లో పాల్గొన్నవారు క్షేమంగా ఉండాలని నేను రోజూ ప్రార్థిస్తాను’’ అని చెప్పుకొచ్చారు.

Advertisement

Next Story