Youtuber Deena: హైదరాబాద్‌లో యూట్యూబర్ ఆత్మహత్య.. వ్యూసే కారణమా..?

by Javid Pasha |
Hyderabad Youtuber Deena Commits Suicide as views not increased
X

దిశ, వెబ్‌డెస్క్: Hyderabad Youtuber Deena Commits Suicide as views not increased| ప్రముఖ యూట్యూబర్ హైదరాబాద్‌లో ఆత్మహత్య చేసుకున్నాడు. గేమింగ్ ఛానెల్‌తో ఫేమస్ అయిన డీనా గురువారం తన అపార్ట్‌మెంట్ భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. లైవ్ ఆన్‌లైన్ గేమ్ ఆడుతూనే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతడి ఆత్మహత్యకు డిప్రెషనే ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఈ ఘటన హైదరాబాద్ సైదాబాద్‌లో గురువారం తెల్లవారు జామున 5 గంటల సమయంలో చోటు చేసుకుంది. అయితే తన గేమింగ్ వీడియోస్‌కు యూట్యూబ్‌లో అంతగా వ్యూస్ రావడం లేదని డీనా గత కొంతకాలంగా ఆందోళన చెందుతున్నాడని, దాంతోనే తీవ్ర డిప్రెషన్‌లోకి వెళ్లి ఉంటాడని, గేమ్ ఆడుతూ కూడా అనేక సార్లు తన బాధను చెప్పుకునేవాడని తెలుస్తోంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని డీనా మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అయితే ఆత్మహత్య చేసుకోవడానికి దాదాపు 8 గంటల ముందే డీనా సూసైడ్ లెటర్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసినట్లు పోలీసులు తెలిపారు.

ఇది కూడా చదవండి: ట్రాన్స్​జెండర్ల సంక్షేమంపై స్టడీ చేయండి.. మంత్రి హరీష్​రావు ఆదేశం



Next Story

Most Viewed