- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హైదరాబాద్ రోడ్లపై బైకుపై ఎంత స్పీడ్‌లో వెళ్లాలో తెలుసా?
దిశ, డైనమిక్ బ్యూరో: వాహనదారులు రోడ్లపై విచ్చలవిడిగా వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు కారకులవుతున్నారు. దీంతో వేగాన్ని నియంత్రించేందుకు ఇప్పటికే పోలీసులు చర్యలు ప్రారంభించారు. ఈ క్రమంలో ఏ రోడ్డుపై ఎంత వేగంతో వెళ్లాలో వాహనదారులకు తెలపడానికి ట్రాఫిక్ పోలీసులు ఓ ప్లాన్ సిద్ధం చేశారు. దీంతో నిర్దేశించిన దానికంటే ఎక్కువ వేగంతో వెళితే భారీగా ఫైన్లు వేస్తున్నారు. ఇలా ఏటా ఏకంగా రూ.300 కోట్ల చలాన్లు విధిస్తోంది. అయితే, హైదరాబాద్ పరిధిలో ఎక్కడ ఎంత వేగంతో వెళ్లాలన్న అవగాహన నగరవాసులకు తెలియకపోవడంతో ఇలాంటి పరిస్థితులు ఎక్కువగా ఎదురవుతున్నాయని అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఏ ప్రాంతంలో ఎంత స్పీడ్‌తో వెళ్లాలో తెలియజేసి గందరగోళానికి తెరదించాలని పోలీసులు నిర్ణయించారు.
ఇందులో భాగంగా ప్రస్తుతం 40 కి.మీ. పరిమితి ఉన్న రోడ్డులో 41 కి.మీ. స్పీడుతో వెళ్తే రూ.1400 జరిమానా విధించేవారు. తాజా నిర్ణయంతో 50 కి.మీ. వేగ పరిమితి ఉన్న మార్గంలో 55 కి.మీ. వేగంతో వెళితే మొదటిసారి వదిలేస్తారు. అంతకుమించి వెళితే రూ.100 నుంచి రూ.1400 వరకు జరిమానా వేస్తారు. రెండుసార్లకు మించి వాహనదారుడు అతివేగంగా వెళితే ఛార్జీషీటు నమోదు చేసి కోర్టులో హాజరుపరుస్తారు. అయితే, గ్రేటర్ పరిధిలో రహదారులను బట్టి 20 కి.మీ. నుంచి 60 కి.మీ వరకు వేగంగా వాహనం నడిపేందుకు పోలీసులు నిర్ణయించారు. కానీ, ఏ రోడ్డుపై ఎంత వేగంతో వెళ్లొచ్చని తెలిపే బోర్డులు పూర్తిస్థాయిలో లేవన్న ఆరోపణలు ఉన్నాయి.
= డివైడర్స్ ఉండే రోడ్లపై కారుకు 60 కిమీ, బస్సు, లారీ, ఆటో, బైకులకు అయితే 50 కి.మీ
= డివైడర్ లేని రోడ్లపై కారుకు 50.కి.మీ, ఇతర వాహనాలు 40 కి.మీ
= పీవీఎన్ఆర్ హైవేలపై కారు, బస్సులకు 80 కి.మీ