తరచూ గొడవలు.. భార్యను హతమార్చిన భర్త

by Vinod kumar |   ( Updated:2022-03-14 13:32:27.0  )
తరచూ గొడవలు.. భార్యను హతమార్చిన భర్త
X

దిశ, ఖమ్మం రూరల్: బండ రాయితో మోది భార్యను హతమార్చిన సంఘటన రూరల్ మండలంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రూరల్​ మండలం వెంకటగిరి ఇందిరమ్మ ఫెస్​ 2లో సంపంగి చిన్న రాములు కూలి పనులు చేసుకుంటూ.. జీవనం సాగిస్తున్నారు. గత కొంతకాలంగా భార్య కళమ్మ–భర్త చిన్న రాములుకు తరుచుగా గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలో సోమవారం కూడా ఇద్దరి మధ్య గొడవ జరిగి.. అది ఘర్షణగా మారడంతో.. కోపోద్రిక్తుడైన భర్త చిన్న రాములు పక్కనే ఉన్న రాయితో తలపై బలంగా కొట్టి చంపాడు. దీంతో కళమ్మ అక్కడికక్కడే మరణించింది. భర్త పరారీలో ఉన్నాడు. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

Advertisement

Next Story