- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భార్య అలా చేసిందని జీర్ణించుకోలేక భర్త ఆత్మహత్య
దిశ, చిన్నశంకరంపేట: ప్రేమించి పెళ్లి చేసుకుని.. ఇద్దరు పిల్లలతో అన్యోన్య దాంపత్యం కొనసాగుతున్న నేపథ్యంలో విధి వక్రీకరించి రోడ్డు ప్రమాదంలో గత సంవత్సరం అన్నపూర్ణ మృతిచెందగా భార్య మృతిని జీర్ణించుకోలేని భర్త గూడూరు చంటి(45) సోమవారం రాత్రి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికుల కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. గుంటూరు చంటి ఆంధ్ర ప్రాంతానికి చెందిన వాడు, జీవనోపాధి నిమిత్తం మెదక్ జిల్లా తూప్రాన్ వలస వచ్చి మేస్త్రి పని చేసుకుంటూ గడిపాడు.
తూప్రాన్ మున్సిపాలిటీ పరిధి మల్లాపూర్ గ్రామానికి చెందిన అన్నపూర్ణ తో 15 సంవత్సరాల క్రితం ప్రేమ వివాహం జరిగింది. గత సంవత్సరం రోడ్డు ప్రమాదంలో అన్నపూర్ణ మృతిచెందగా భార్య మృతి జీర్ణించుకోలేని మనస్థాపానికి గురైన చంటి.. సోమవారం రాత్రి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తల్లిదండ్రుల మృతితో అనాథగా మారిన చిన్నారుల రోదన చూపరులను కంటతడి పెట్టించింది. మృతుడి పెద్ద కూతురు పూజిత చేగుంట మెడికల్ కాలేజీలో ఇంటర్ చదువుతుండగా, అనూష తూప్రాన్ లో 9వ తరగతి చదువుతుంది. తల్లిదండ్రుల మృతితో అనాధలుగా మారిన చిన్నారులను ప్రభుత్వం ఆదుకోవాలని పలువురు కోరారు.