- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సింహరాశి వారికి శ్రీ శుభకృత్ నామ సంవత్సరం ఎలా ఉంటుందంటే..
మఖ 1, 2, 3, 4 (మా, మి, మూ, మే) పుబ్బ 1, 2, 3, 4 (మో, టా, టీ, టూ) - ఉత్తర ఫల్గుని 1 (టే)
ఆదాయం-8
వ్యయం -14
రాజపూజ్యం-1
అవమానం-5
ఈ రాశి వారికి గురుడు సప్తమయిన 13.04.2022 వరకు తామ్రమూర్తిగా ఉండును. తదుపరి అష్టమంలో వత్సరాంతము వరకు సువర్ణమూర్తిగా సంచరించును. శని వత్సరాది నుండి 29.04.2022 వరకు అష్టమంలో సువర్ణమూర్తిగా తదుపరి 12.07.2022 వరకు సప్తమంలో లోహమూర్తిగా, సంవత్సరాంతములో 17.01.2023 వరకు షష్టమములో రజతమూర్తిగా, లోహమూర్తిగా గోచరించును. రాహువు భాగ్యములో కేతువు తృతీయములో సువర్ణమూర్తిగా గోచరించును. సింహరాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. జీవితంలో మంచి స్థానాన్ని సాధిస్తారు. సమాజంలో అత్యున్నతమైన పేరు సాధిస్తారు. గతంలో చేసిన పొరపాట్లు మళ్లీ చేయవద్దు. ముఖ్యమైన వ్యక్తులతో మీకున్న సంబంధ బాంధవ్యాలను సరిదిద్దుకోవడానికి ప్రయత్నించి విజయం సాధిస్తారు. శుభకార్యాల నిమిత్తం, విందుల నిమిత్తం, విద్యల నిమిత్తం డబ్బు ఖర్చు చేస్తారు. స్వగృహ నిర్మానం అనే చిరకాల కోరిక నెరవేరుతుంది. ఇప్పటికే స్వగృహం ఉన్న వారికి విలువైన స్థిరాస్తులు ఏర్పడుతాయి. ప్రజాసంబంధాలు పెంచుకుంటారు. మీ ఆధ్వర్యంలో నడుస్తున్న విద్యాసంస్థలు గట్టి పోటీని విమర్శలను ఎదుర్కొనవలసి వస్తుంది. సంతానం విషయంలో కొన్ని కఠినమైన నిర్ణయాలు అనివార్యం అవుతాయి.
ఈ రాశిలో జన్మించిన వారికి ప్రేమ వివాహాలు చెప్పదగినవి కావు. తాత్కాలిక వ్యామోహంలో జీవితాన్ని కష్టాలపాలు చేసుకోవద్దు. మధ్యమధ్యలో జీవిత భాగస్వామితో విభేదాలు ఏర్పడుతాయి. కుటుంబ సభ్యులతో అభిప్రాయ భేదాలు చోటుచేసుకుంటాయి. ఉద్యోగ వ్యాపారాల్లో అధిక ఒత్తిడి, శ్రమ కలిగి ఉంటారు. చాలా విషయాల్లో ఒంటరి పోరాటం చేయక తప్పదు. ఇతరులు అడిగే ప్రశ్నలకు ఓర్పుగా సమాధానం చెప్పటం మంచిది. మీ ప్రమేయం లేకుండానే మిమ్మల్ని వివాదంలోకి లాగే యత్నాలు మీ శత్రువర్గం చేయటం జరుగుతుంది. జాగ్రత్త వహించండి.. క్రయ విక్రయాల్లో మెలకువలు పాటించండి. కళ్లు అలసటకు లోనుకాకుండా జాగ్రత్తలు తీసుకోండి. దొంగ స్వామీజీల వల్ల నష్టపోతారు. భాగస్వామ్య వ్యాపారాలు బాగుంటాయి. కోర్టు తీర్పులు అనుకూలంగా వస్తాయి. విద్యాసంబంధమైన విషయాలు బాగుంటాయి. మెరిట్ మార్కులు వస్తాయి. దగ్గరి దాకా వచ్చి, దూరంగా వెళ్తున్న సంబంధాలు ఈ సంవత్సరం కుదురుతాయి. వివాహం ఘనంగా చేస్తారు. రాజకీయపరమైన జీవితం బాగుంటుంది. మీ కష్టం వృథా పోదు. మీ కష్టానికి తగిన గుర్తింపు వస్తుంది. భగవంతుడి అనుగ్రహం ఉంది. వ్యాపార సంబంధమైన విషయాల్లో కొత్త కోణాలను ఆవిష్కరిస్తారు. వ్యాపారంలో రొటేషన్ లాభాలు బాగుంటాయి. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. పాతబాకీలు తీర్చివేస్తారు. మొండికి పడ్డ బకాయిలు చేతికి అందివస్తాయి. తల్లిదండ్రులకు, పెద్దలకు అత్యంత ప్రాధాన్యతనిస్తారు.
వాళ్లకు చెప్పనిదే ఏ పని చేయరు. స్నేహం అంటే వ్యాపారం అని మీ దృష్టిలో తేలిపోతుంది. వ్యాపారాత్మక స్నేహాలు అనవసరం అని భావిస్తారు. ప్రతి విషయంలోనూ స్వప్రయోజనాలకే ప్రాముఖ్యతనివ్వాలని నిర్ణయించుకుంటారు. కుటుంబ సభ్యుల సౌకర్యం కొరకు అధికంగా డబ్బు ఖర్చు చేస్తారు. ఇతరుల కష్టాల్లో పాలు పంచుకోకూడదని నిర్ణయించుకుంటారు. అవివాహితులైన వారికి వివాహకాలం, అరిష్ట ఉద్వాసనకు నల్లవత్తులతో దీపారాధన చేయండి. వ్యాపార విస్తరణ చేయడానికి నూతన భాగస్వాములను కలుపుకుంటారు. స్త్రీలతో అభిప్రాయ భేదాలు కొంతకాలం ఇబ్బంది పెడుతాయి. స్వయం అభివృద్ధి ప్రణాళికలు కామధేనువు వలే మేలు చేస్తాయి. విదేశీ వస్తువులు అమితంగా ఆకర్షిస్తాయి. విందులు, వినోదాలు, విలాసాల కొరకు ధనాన్ని అధికంగా ఖర్చు చేస్తారు. గడిచిపోయినటువంటి సంఘటనల గురించి ఆలోచించకుండా భవిష్యత్తుకు అధిక ప్రాముఖ్యతనిస్తారు. సంతానం గురించి అధికంగా ఆలోచిస్తారు. వారి అభివృద్ధికి కావాల్సిన వనరులను సమకూర్చుతారు. జీవిత భాగస్వామితో ఏర్పడిన స్వల్ప విభేదాలు చిలికి చిలికి గాలివాన కాకుండా ఆదిలోనే పరిష్కరించుకుంటారు. మొండిధైర్యంతో మీ పనిని మీరు చేసుకుపోతారు. సన్నిహితులు వద్దని వారించినా భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు. శాస్త్ర, సాంకేతిక విషయాలపై ఆసక్తి చూపుతారు. సంఘంలో మీ కంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకోవడానికి గాను అవిశ్రాంతంగా శ్రమిస్తారు.