- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సింహాద్రి హీరోయిన్.. ఇప్పుడెలా తయారైందో చూడండి
దిశ, వెబ్‌డెస్క్ : ఒకప్పటి సీనియర్ హీరోయిన్స్ చాలా మంది ఇప్పుడు చిత్రపరిశ్రమలో కనిపించడం లేదు. ఒకప్పుడు వరస సినిమాలతో ఓ వెలుగు వెలిగిన సీనియర్ హీరోయిన్స్.. కొందరు పెళ్లి చేసుకొని ఫ్యామిలీకే అంకితం అయితే మరికొందరు ఆంటీ, మదర్ క్యారెక్టర్స్ చేస్తున్నారు. ఇక కొంత మందిజాడే లేకుండా పోయారు. అందులో ఒకరు సింహాద్రి హీరోయిన్ అంకిత. ఈ అమ్మడు ఒకప్పుడు తన గ్లామర్ డోస్‌తో కుర్రకారును మాయ చేసింది. లహర లహరి మూవీతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ.. అనతి కాలంలో చాలా సినిమాలు చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక రాజమౌళి సింహాద్రి మూవీలో ఈ అమ్మడు సెకండ్ హీరోయిన్‌గా నటించిన విషయం తెలిసిందే. ఇందులో అంకిత గ్లామర్ డోస్‌తో అందరి మతి పోగొట్టిందని చెప్పవచ్చు.. చీమ చీమ చీమ అనే సాంగ్‌ల్ ఈ అమ్మడు అందానికి అందరూ ఫిదా అయ్యారు. ఇక ఈ సినిమా తర్వాత వరసగా ఆఫర్లు రావడంతో.. స్టేట్‌రౌడీ, బాల్యయతో విజయేంద్రవర్మ, సీతారాముడు లాంటి పలు సినిమాల్లో నటించింది. తర్వాత ఫ్లాప్‌లు రావడంతో ఈ నటి చిత్రపరిశ్రమకు దూరమై తన ఫ్యామిలీతో ఆనందంగా గడుపుతోంది.
గతంలో సన్నగా, గ్లామరెస్‌తో హాట్ హాట్‌గా కనిపించే ఈ బ్యూటీ ప్రస్తుతం బొద్దుగా తయారై తన అందాన్ని మరింత రెట్టింపు చేసుకుంది. ఇక ఈ నటి ప్రస్తుతం తన భర్త, కొడుకుతో సంతోషంగా ఉంటుందంట. అంతే కాకుండ తన తండ్రి మరణించడంతో.. అతని వజ్రాల వ్యాపారం ఈ అమ్మడే రన్ చేస్తోందంట. ఇక తనకు మళ్లీ సినిమాల్లోకి వచ్చే ఆసక్తి లేదని తన అభిమానులకు తేల్చి చెప్పింది ఈముద్దుగుమ్మ.
అంజలికి అభిమానుల స్పెషల్ రిక్వెస్ట్.. అలా ట్రై చేయకండి అంటూ..