Ananya Nagalla: కమిట్మెంట్‌ను బట్టే పారితోషికం ఎక్కువ ఉంటుందా.. రిపోర్టర్ ప్రశ్నకు హీరోయిన్ స్ట్రాంగ్ రిప్లై

by sudharani |   ( Updated:2024-10-22 08:27:15.0  )
Ananya Nagalla: కమిట్మెంట్‌ను బట్టే పారితోషికం ఎక్కువ ఉంటుందా.. రిపోర్టర్ ప్రశ్నకు హీరోయిన్ స్ట్రాంగ్ రిప్లై
X

దిశ, సినిమా: యువ చంద్ర కృష్ణ (Yuva Chandra Krishna), అనన్య నాగళ్ల (Ananya Nagalla) లీడ్ రోల్స్‌లో నటిస్తున్న తాజా చిత్రం ‘పొట్టేల్’ (Pottel). ఈ మూవీని నిసా ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై నిశాంక్ రెడ్డి కుడితి, ప్రజ్ఞా సన్నిధి క్రియేషన్స్‌పై సురేష్ కుమార్ సడిగే నిర్మిస్తుండగా.. దీనికి సాహిత్ మోత్ఖూరి దర్శకత్వం వహిస్తున్న . ఇప్పటికే ఇందులో నుంచి వచ్చిన అప్‌డేట్స్‌కు సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ రాగా.. ప్రమోషనల్ కంటెంట్‌తో 'పొట్టేల్' (Pottel) పై స్ట్రాంగ్ బజ్ క్రియేట్ చేస్తున్నారు చిత్ర బృందం. ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ (Trailer) ను రిలీజ్ చేసింది హీరోయిన్ సంయుక్త.

ఇక ట్రైలర్ (Trailer) రిలీజ్ అనంతరం మీడియాతో ముచ్చటించారు చిత్ర బృందం. ఈ క్రమంలోనే తనకు ఎదురైన ప్రశ్నకు స్ట్రాంగ్ రిప్లై (Strong Reply) ఇచ్చింది అనన్య నాగళ్ల (Ananya Nagalla). ‘సినిమాల్లో అవకాశం ఇచ్చే ముందు కమిట్మెంట్ (commitment) అడుగుతారంట నిజమేనా.. అలాగే కమిట్‌మెంట్ (commitment) ను బట్టే పారితోషికం ఉంటుందని విన్నాను.. ఇలా మీరేప్పుడైనా ఫేస్ చేశారా’ అనే రిపోర్టర్ ప్రశ్నకు అనన్య స్పందించి ‘మీరెలా అంత కచ్చితంగా చెప్తున్నారు. మీరు అనుకునేది 100 శాతం అబద్ధం. అవకాశం ఇచ్చే ముందు కమిట్‌మెంట్ (commitment) అడగటం అనేది నిజంగా అవాస్తవం. మీరు విన్నది చెప్తున్నారు. కానీ నేను ఇదే ఫీల్డ్‌లో ఉంటున్న.. మీరు అనుకునే విధంగా ఇక్కడ ఉండదు’ అంటూ రిప్లై ఇచ్చింది ఈ బ్యూటీ.

Advertisement

Next Story