ప్రమాదం జరిగినప్పుడు కాపాడేది అదొక్కటే.. ఏఎస్పీ డాక్టర్ శబరిష్

by Satheesh |
ప్రమాదం జరిగినప్పుడు కాపాడేది అదొక్కటే.. ఏఎస్పీ డాక్టర్ శబరిష్
X

దిశ, మణుగూరు: వాహన చోదకులు ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి ప్రాణాలనుకాపాడుకోవాలని మణుగూరు డివిజన్ ఏఎస్పీ డాక్టర్ శబరిష్ అన్నారు. బుధవారం మండలంలోని పోలీస్ స్టేషన్ నుంచి సురక్ష బస్టాండ్ వరకు మణుగూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ ముత్యం రమేష్ నేతృత్వంలో వాహన చోదకులతో కలిసి హెల్మెట్ వాడకంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు ప్రాణాపాయం నుంచి కాపాడేది ఒక్క హెల్మెట్ మాత్రమేనని వివరించారు.‌ హెల్మెట్ ధరించని వారికి జరిమానా విధించినా కొంత మంది వాహన చోదకులలో మార్పులు రావటం లేదన్నారు. అందుకే హెల్మెట్‌ దరిద్దాం.. ప్రాణాలు కాపాడుకుందామంటూ ర్యాలీ చేస్తూ నినాదాలతో హోరెత్తించమన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సైలు నరేష్, బట్ట పురుషోత్తం, ఏఎస్సై నాగేశ్వరావు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story