బయటపడ్డ అమ్మవారి విగ్రహం.. గుడి కడతామని హామీ

by Javid Pasha |
బయటపడ్డ అమ్మవారి విగ్రహం.. గుడి కడతామని హామీ
X

దిశ, అంబర్ పేట్ : అంబర్ పేట్ నియోజకవర్గంలోని పటేల్ నగర్ వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్‌కు సంబంధించిన రోడ్డు పనుల్లో అమ్మవారి విగ్రహం బయట పడింది. సమాచారం తెలుసుకున్న స్థానికులు పెద్ద ఎత్తున అమ్మవారి విగ్రహం వద్దకు చేరుకున్నారు. ఈ క్రమంలో స్థానిక కార్పొరేటర్ విజయ్ కుమార్ గౌడ్ ఘటనాస్థలానికి చేరుకొని అమ్మవారి విగ్రహానికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..వాటర్ వర్క్స్ పనుల్లో భాగంగా గ్రామ దేవత విగ్రహం వెలుగు చూసినట్లు తెలిపారు. అతి పురాతనమైన విగ్రహంగా ఉన్నట్లు పేర్కొన్నారు. అంబర్ పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్, మంత్రి శ్రీనివాస్ యాదవ్ సహకారంతో అమ్మవారికి గుడి కట్టే ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.



Advertisement

Next Story