వింత మేక జననం.. 7కాళ్లు, 2నాలుకలు.. చివరకు..

by Satheesh |   ( Updated:2022-03-08 15:02:32.0  )
వింత మేక జననం.. 7కాళ్లు, 2నాలుకలు.. చివరకు..
X

దిశ, పెద్దేముల్: పెద్దేముల్ మండలంలోని మంబాపూర్ గ్రామంలో సోమవారం వింత మేకపిల్ల జన్మించిన ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మంబాపూర్ గ్రామంలోని బాబా అనే వ్యక్తి మేకలు పెంచుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అయితే, అందులో ఒక మేక సోమవారం ఎనమిది పిల్లలకు జన్మనిచ్చింది. కాగా, ఎనమిదవ సంతానంలో జన్మిచించిన మేక పిల్ల మాత్రం.. ఏడు కాళ్లు, రెండు నాలుకలు, ఒక తలతో వింతగా పుట్టింది. అలా పుట్టిన మేక పిల్లను తల్లి నుండి వేరు చేసే క్రమంలో చనిపోయింది. ఈ విషయమై పశువైద్యాధికారులకు సమాచారం ఇవ్వగా.. జన్యులోపంతో కొన్ని సార్లు ఇలా జరుగుతుందని వారు తెలిపారు.

Next Story

Most Viewed